విషాదం నింపిన కార్తీక పౌర్ణమి

23 Nov, 2018 08:10 IST|Sakshi
మర్రి చెట్టుపై వేలాడుతున్న విద్యుత్‌ వైర్లు సూరిబాబు మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య, కుమారుడు

మర్రి ఆకులు తెంపుతూ

విద్యుత్‌ఘాతానికి గురై  కార్పెంటర్‌ మృతి

విశాఖపట్నం, నర్సీపట్నం: కార్తీక పౌర్ణమి  కార్పెంటర్‌ కుటుంబంలో విషాదాన్ని నింపింది. పౌర్ణమి వ్ర తానికి అవసరమైన మర్రి ఆకులను తెంపేం దుకు  చెట్టు ఎక్కిన  కార్పెంటర్‌ రామోజు సూరిబాబు(40)  విద్యుత్‌ఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు.  ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.   సూరిబాబు మృతితో  ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శుక్రవారం జరిగే కార్తీక పౌర్ణమి  వ్రతంలో పూజకు అవసరమైన మర్రి ఆకులను తెచ్చేందుకు తన  పెద్ద కుమారుడు సాయికుమార్‌ను వెంటపెట్టుకుని పట్టణంలోని పెద్దచెరువు శివాలయం వద్ద ఉన్న మర్రి చెట్టు వద్దకు   సూరిబాబు వెళ్లాడు.  మర్రిచెట్టుపై  33 కేవీ విద్యుత్‌ లైన్‌ వైర్లు వేలాడుతున్నాయి.

విద్యుత్‌ వైర్లను గమనించని సూరిబాబు ఆకులు తెంపేందుకు చెట్టు ఎక్కాడు. దీంతో విద్యుత్‌ వైర్లకు అంటుకుపోయాడు. కళ్లముందే తండ్రి విద్యుత్‌ఘాతానికి గురై గిలగిల కొట్టుకుంటే ...మానాన్నను రక్షించండంటూ సాయికుమార్‌ పెద్దకేకలు వేశాడు. ఇంతలోనే తండ్రి ప్రాణాలు కోల్పోయి చెట్టుపై నుంచి కిందపడిపోయాడు.  నాన్న..లేనాన్న అంటూ సాయికుమార్‌ భోరున విలపించాడు. విషయం తెలుసుకుని వచ్చిన భార్య మంగ భర్త మృతదేహన్ని చూసి సొమ్మసిల్లిపోయింది.  నిన్ను అనవసరంగా ఆకుల కోసం పంపించానని  రోదించింది. ఈ సంఘటనను చూసిన స్థానికులు కంటితడి పెంటారు.  సంఘటన స్థలానికి విద్యుత్‌శాఖ ఏఈ నాగేశ్వరరావు చేరుకుని   పరిశీలించారు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు