పెళ్లి ముచ్చట తీరకనే!

27 Mar, 2019 11:48 IST|Sakshi
భరత్‌ (ఫైల్‌)

టెక్కలిలో రైలుకింద పడి బి.కొత్తకోట యువకుడు మృతి

ప్రమాదానికి ముందుకు తండ్రికి ఫోన్‌

బి.కొత్తకోట : పెళ్లి ముచ్చట తీరలేదు, బంధువుల ఇళ్లకు వెళ్లి సొంతూరిలో ప్రయివేటు ఆస్పత్రి ప్రారంభించి స్థిరపడాలనుకొన్న ఓ యువకుడు సరిగ్గా వివాహమైన∙90వ రోజు  మృత్యువు పాలయ్యాడు. మృతుడు బి.కొత్తకోట వాసి కాగా సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. కుటుంబీకుల కథనం మేరకు వివరాలు..

బి.కొత్తకోటకు బీసీకాలనీకి చెందిన బీజేపీ నాయకుడు కే.రవీంద్ర కుమారుడు కే.భరత్‌ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేశాడు. ఇతనికి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన లావణ్యతో గత డిసెంబర్‌ 17న బి.కొత్తకోటలో వివాహం జరిగింది. భార్యభర్తలు ఇద్దరూ నర్సింగ్‌ పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే బి.కొత్తకోటలో ఆస్పత్రిని ప్రారంభించి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని టెక్కలిలోని అత్తామామలకు చెప్పి రావాలని వెళ్లారు. హైదరాబాద్‌లోని లావణ్య సోదరి వద్దకు వెళ్లేందుకు మంగళవారం మధ్యాహ్నం టెక్కలి రైల్వేస్టేషన్‌ చేరుకున్నారు. 2 గంటలకు భరత్‌ బి.కొత్తకోటలోని తండ్రి రవీంద్రకు ఫోన్‌చేసి 2.30గంటలకు రైలులో బయలుదేతున్నట్టు చెప్పాడు. హైదరాబాద్‌ వెళ్లే రైలు రాగానే భార్య లావణ్యను రైలులోకి పంపి లగేజీని అందించి రైలు ఎక్కబోతుండగా జారి రైలు కింద పడడంతో కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి.æ తీవ్ర రక్తస్రావం కావడంతో భరత్‌ను ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. భరత్‌ మృతి చెందిన వార్త కుటుంబీకులకు తెలియడంతో కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. కాగా అక్కడి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు