108 వాహనానికి యాక్సిడెంట్‌..!

28 Feb, 2019 15:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తూర్పుగోదావరి : బైక్‌-ట్రాక్టర్‌ డీకొట్టిన ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కోరుకొండ మండలం  పశ్చిమ గొనగూడెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే వెంటనే 108కి ఫోన్‌ చేశారు. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. మార్గమధ్యంలో 108 వాహనానికి యాక్సిడెంట్‌ జరిగింది. దీంతో అందులో ఉన్న యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు