ఎలుక పెట్టిన లొల్లి.. ఒకరు మృతి

7 Oct, 2018 12:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. చచ్చిన ఎలుకను తన ఇంటి ముందు వేసాడనే ఆగ్రహంతో ఒకరు తన పక్కింటతని పై ఐరన్‌ రాడ్‌తో దాడి చేయగా.. ఆ వ్యక్తి (40) చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. గత సోమవారం ఢిల్లీ కిరారి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని, నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇక గత గురువారం ఉత్తమ్‌ నగర్‌లో చోటుచేసుకున్న మరో ఘటన కూడా ఇదే తరహాలో ఉండటం చర్చనీయాంశమైంది. తన పెట్‌డాగ్‌ను వ్యాన్‌తో ఢీకొట్టి చంపాడని ఓ వ్యక్తి ఆ వ్యాన్‌ డ్రైవర్‌ని కత్తితో పొడిచి చంపాడు. వేర్వేరుగా చోటు చేసుకున్న ఈ ఘటనలు ప్రస్తుతం ఢిల్లీ వాసులను, పోలీసులను కలవరపెడుతున్నాయి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా