చార్జింగ్‌లో ఉన్న మొబైల్‌ పేలి యువకుడి మృతి

11 Nov, 2019 15:37 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్‌లో ఉండగా పేలిన మొబైల్‌ ఫోన్‌ ఒకయువకుడి ప్రాణాలుతీసింది.  భవన నిర్మాణ కార్మికుడైన కునా ప్రధాన్‌ (22) తన ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి, మరో ముగ్గురు కార్మికులతో పాటు గదిలో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాలోని పారాడిప్‌లో ఆదివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. 

పారాడిప్ పోలీస్ స్టేషన్  అధికారిక  ఆర్‌కె సమల్ అందించిన సమాచారం ప్రకాచరం చార్జింగ్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌  ఒక్కసారిగా పేలడంతో ప్రధాన్‌ అక్కడిక్కడే చనిపోయాడు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకోసం ఆసుపత్రికి  తరలించారు. బాధితుడిని నాయగర్ జిల్లాలోని రాణ్‌పూరి ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ట్రక్ యజమానుల సంఘం చేపట్టిన పారదీప్‌లో ఆలయ నిర్మాణ పనుల్లో కార్మికుడిగా  పనిచేస్తున్నాడు. 

మరిన్ని వార్తలు