కొంపముంచిన దావత్‌

3 Jan, 2019 10:42 IST|Sakshi
వెలికితీసిన రాజేష్‌ మృతదేహం రాజేష్‌(ఫైల్‌)

కాలుజారి బావిలో పడి యువకుడి మృతి

స్నేహితులతో పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం

కామారెడ్డి క్రైం: అప్పటిదాకా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఓ యువకుడిని బావి రూపంలో మృత్యువు కబళించింది. మద్యం మత్తులో కాలు జారి బావిలో పడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహం 20 గంటలపాటు గా లించాక లభించింది. ఈ సంఘటన కామారెడ్డిలో గురువారం కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ్‌గల్లీకి చెం దిన మైసరి పార్వతీ–మురళీకి ఇద్దరు సంతానం.

వీరిలో పెద్దవాడు రాజేష్‌(26)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో రెడిమేడ్‌ దుస్తుల దుకాణం పెట్టుకుని కొంత కాలం నడిపించి లాభాలు సరిగా రాకపోవడంతో ఆ వ్యాపారాన్ని వదులుకున్నాడు. మంగళ వారం రాత్రి రాజేష్, అతడి స్నేహితులు కలిసి మ ద్యం సేవించేందుకు పెద్ద చెరువు సమీపంలోకి వెళ్లారు. చెరువు కట్ట పక్కనే ఉన్న మత్తడి వద్ద వ్య వసాయ బావికి కొద్ది దూరంలో మద్యం తాగారు. సుమారు 11 గంటల ప్రాంతంలో బావి పక్కనే ఉన్న దారి గుండా తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు.

సమాచారం తెలుసుకు న్న రాజేష్‌ బంధువులు, స్నేహితు లు, స్థానికులు పె ద్ద ఎత్తున బావి వద్దకు చేరుకున్నారు. మృ తదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బావిలోతుగా ఉండి మృతదేహం లభించ లేదు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బుధవారం ఉదయం నుంచి బావిలోని నీటిని మోటార్ల ద్వారా ఖాళీ చేయించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాజేష్‌ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పట్టణ ఎస్‌హెచ్‌వో రామక్రిష్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు