బైక్‌ పైనే ఉన్నా.. ఇంటికి వచ్చేస్తున్నా..!

18 Nov, 2019 08:38 IST|Sakshi
పొలాల్లో పడి ఉన్న ద్విచక్రవాహనం ఇన్‌సెట్‌లో పైడియ్య మృతదేహం

ఫోన్‌ కట్‌ చేసిన కాసేపటికే ప్రమాదంలో వ్యక్తి మృతి 

తల్లడిల్లిన కుటుంబ సభ్యులు అంబకండిలో విషాదం

సాక్షి, రాజాం సిటీ: ఇంటికి వచ్చేస్తున్నాను.. మాటిమాటికి ఫోన్‌ చేయొద్దు.. బండిమీద ఉన్నాను.. అన్న మాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. మరో అరగంట తర్వాత కుటుంబ సభ్యులు మళ్లీ ఫోన్‌చేసినా ఫలితం లేకుండాపోయింది. శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగిడి మండలం అంబకండి గ్రామానికి చెందిన వాడబోయిన పైడియ్య (30)కొబ్బరికాయలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వృద్ధ తల్లిదండ్రులతోపాటు భార్య, ఇద్దరు చిన్నారులను కూడా కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. కార్తీకమాసం కావడంతో శనివారం కొబ్బరికాయలను అమ్మకం చేసి తిరిగి బైకుపై ఇంటికి వెళ్తున్న సమయంలో రాజాం మండలం శ్యాంపురం వెళ్లే దారిలో చెరువు గట్టుపై అదుపుతప్పి పంటపొలాల్లోకి పడిపోయాడు.

ఆ సమయంలో ఎవరూ లేకపోవడం, తలకు పెద్ద గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కొబ్బరికాయలు అమ్మి వేగంగా ఇంటికి వస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త విని కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది. తండ్రి శివుడు, తల్లి నారాయణలు లబోదిబోమంటూ సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. పిల్లలతో కన్న వారింట్లో ఉన్న భార్య శాంతి.. భర్త మరణించాడన్న వార్త తెలియడంతో సొమ్మసిల్లి పడిపోయింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న పైడియ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ జి.సోమశేఖర్‌ తెలిపారు. 

 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరణంతో ఏకం.. ఒకే గోతిలో ప్రేమజంట ఖననం  

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. పోలీస్‌ క్వార్టర్స్‌

అంత్యక్రియలు చేశాక.. తిరిగొచ్చాడు

చెవి కొరికి..చెప్పులతో కొట్టుకున్న వీఆర్వోలు

ఈ బాబాయ్‌ బిల్డప్‌ అంతా ఇంతా కాదు

భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త 

చెల్లెలి వరుసయ్యే యువతితో ప్రేమ పెళ్లి

అనుమానంతో మహిళ హత్య

భార్య టీ పెట్టి ఇవ్వ లేదని..

దక్షిణాదివారికి ఆశ ఎక్కువ..

రెండో పెళ్లి చేసుకున్న భార్యపై కేసు

కీచక తమ్ముడు.. ఒంటరి మహిళలపై అఘాయిత్యాలు

యూపీ మసీదు పేలుడు కేసులో సిటీ డాక్టర్‌

ఇద్దరి ఉసురు తీసిన రూ.40 వేలు

మద్యం మత్తులో మృగంలా మారి

పగ పెంచుకుని.. అమ్మను చంపేశారు..

భార్య టీ పెట్టివ్వ లేదని..

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

దారుణం.. కజిన్ కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి..

గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌.. ఏడుగురి మృతి

పోలీసులపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం

ఆ కారణంగానే ఎక్కువ హత్యలు

విహార యాత్రలో విషాదం

టిక్‌టాక్‌లో చూసి శివకుమార్‌ ఫిదా.. కానీ,

కర్కశం : కన్న కొడుకును ఉరేసి..

బంజారాహిల్స్ పీఎస్‌లో యువతి హల్‌చల్‌

విషాదం : ఇంగ్లీష్‌ అర్థం కావడం లేదని..

దారుణం: వివాహిత సజీవ దహనం

పెళ్లి కావడంలేదనే బాధతో..

జీవితాంతం కలిసుందామనుకున్నారు కానీ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తర్వాత ఏం జరుగుతుంది?

రాహు జాతకాల కథ కాదు

పిక్చర్‌ షురూ

టీజర్‌ రెడీ

నడిచే నిఘంటువు అక్కినేని

థాయ్‌కి హాయ్‌