స్టార్‌ హోటల్‌లో దిగాడు.. లక్షల్లో బిల్లు ఎగ్గొట్టాడు

9 Aug, 2019 09:34 IST|Sakshi

బంజారాహిల్స్‌:  బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1లోని తాజ్‌బంజారా హోటల్‌కు ఓ వ్యాపారి లక్షల్లో బిల్లు ఎగ్గొట్టి పరారయ్యాడు. తాజ్‌బంజారా హోటల్‌ జీఎం హితేంద్రశర్మ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. విశాఖపట్నం వినాయకటెంపుల్‌ సమీపంలోని కిర్లంపుడి లేఅవుట్‌లో ఉన్న సాగర్‌ దీప అపార్ట్‌మెంట్స్‌లో నివసించే అక్కింశెట్టి శంకర్‌ నారాయణ్‌ గతేడాది ఏప్రిల్‌ 4న తాజ్‌బంజారా హోటల్‌కు వచ్చి తాను ఏడాదిపాటు వ్యాపారనిమిత్తం ఇక్కడ బస చేయడానికి ఉంటున్నానని ఒకేగదిని దీర్ఘకాలిక ప్రాతిపదికన కేటాయించాల్సిందిగా కోరాడు. దీంతో గతేడాది ఏప్రిల్‌ 4న ఆయనకు హోటల్‌లో రూమ్‌ నెంబర్‌ 405 కేటాయించారు. మధ్యలో  రూ.13.62 లక్షలు బిల్లు చెల్లించాడు. దీంతో హోటల్‌ నిర్వాహకులను నమ్మిస్తూ తర్వాత బిల్లులు వాయిదాలు వేస్తూ వచ్చాడు. గత ఏప్రిల్‌ 15వ తేదీన ఆయన గదికి తాళం వేసి వెళ్ళిపోయాడు. రోజులు గడిచినా రాకపోవడంతో నిర్వాహకులు సంప్రదిస్తూ వచ్చారు. మొత్తం 102 రోజులకుగాను హోటల్‌ బిల్లు రూ. 25,96,693 కాగా అందులో రూ. 13,62,149 చెల్లించాడు. మిగతా రూ. 12,34,544 బాకీ పడ్డాడు. ఈ మొత్తాన్ని చెల్లించకుండానే గది విడిచి పరారయ్యాడు. జూన్‌ 26వ తేదీన ఆయనకు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ అని వచ్చింది. వెతికినా ఫలితం లేకుండా పోయింది.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు

తల్లిని కడతేర్చిన తనయుడు

అక్కను చంపిన తమ్ముడు

కొత్తదారుల్లో కేటుగాళ్లు!

గుజరాత్‌కు ఉగ్రవాది అస్ఘర్‌అలీ

స్టాక్‌ మార్కెట్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసం

కుప్పకూలిన భవనం: నలుగురి మృతి

అమెరికాలో డాక్టర్‌ దంపతులు దుర్మరణం

కీచక ఉపాధ్యాయుడు.. తరగతి గదిలో విద్యార్థినిలపై..

చెల్లెలి భర్తతో మహిళ పరారీ

శుభమస్తు షాపింగ్‌ మాల్‌లో భారీ చోరీ 

దైవదర్శనానికి వెళుతూ..

దుబాయ్‌లో జగిత్యాల వాసి దుర్మరణం

తాడ్వి ఆత్మహత్య కేసు; ముగ్గురికి బెయిల్‌

షాపింగ్‌ మాల్‌లో భారీ చోరీ

సీఎం కార్యాలయానికి బెదిరింపు సందేశాలు

లారీ, కారు ఢీ; ఆరుగురు దుర్మరణం..!

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ

ముళ్ల పొదల్లో.. కొన ఊపిరితో..

మంచినీళ్లు తెచ్చేలోపే.. 

స్నేహితుడి భార్య కోసం హత్య..!

అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’

గుజరాత్‌ కోర్టుకు ఐఎస్‌ఐ తీవ్రవాది

మాకేదీ న్యాయం? :హాజీపూర్‌ వాసులు

ఆధిపత్య పోరులోనే కోటయ్య హత్య

వజ్రాలు కొన్నాడు... డబ్బు ఎగ్గొట్టాడు

దొంగ పనిమనుషులతో జరజాగ్రత్త..

పసి మొగ్గలను నలిపేస్తున్న కీచకులకు ఉరే సరి!

తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి..

బాత్‌రూంలో ఉరివేసుకొని నవవధువు మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌