‘రెవెన్యూ’ లీలలు..!

7 Jan, 2019 10:42 IST|Sakshi
వెంకటలక్ష్మీ నర్సింహారావు (ఫైల్‌)

కోదాడ: రెవెన్యూ అధికారుల లీలలకు ఈ ఘటన పరాకాష్ట. చనిపోయిన వ్యక్తి పేరుతో కొందరు అగ్రిమెంట్‌ సృష్టించగా, సదరు అక్రమార్కులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. ఇంకేముంది దానిని సాదాబైనామా పేరుతో క్రమబధ్వీకరించారు. అంతేకాకుండా  మరణించిన వ్యక్తి వారసులకు తెలియకుండానే అక్రమార్కులకు పట్టాదారుపాస్‌ పుస్తకాలూ జారీ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న వారసులు ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పు జరిగింది. మీరు  భూమి మీదకు వెళ్లండని ఉచిత సలహా ఇస్తున్నారు. మరోపక్క భూమి మీద ఉన్న వారిని వారు వస్తే  చూసుకోండని రెచ్చగొడుతున్నారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత అధికారులు గతంలో జరిగింది దానికి మేము ఏం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో అసలు భూ యజమానులు తమ భూమికోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.  

అసలు విషయం ఏమిటంటే...
పూర్వం నడిగూడెం మండలంలో ఉండి ప్రస్తుతం అనంతగిరి మండల పరిధిలోకి వచ్చిన త్రిపురవ రంగ్రామానికి చెందిన కెవిఎల్‌.నర్సిహారావు(లక్ష్మప్ప)కు అదే గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నం బర్‌లు 15, 21లలో 3 ఎకరాల భూమి ఉంది. ఈయన 09–01 2009న మృతిచెందాడు. విచిత్రమేమిటంటే ఈయన 20–05–2010న అగ్రిమెంట్‌ రాసినట్లు ఓ కాగితాన్ని సృష్టించారు. దీని ఆధారంగా  ఇటీవల సాదాబైనామాల క్రమబద్ధీకరణ లో భాగంగా రెవెన్యూ అధికారులు సదరు ఫోర్జరీ చేసిన వ్యక్తులతో కుమ్మక్కయ్యారు. వెనుకాముం దు విచారణ కూడా చేయకుండా తప్పడు రికార్డుతో  సదరు వ్యక్తుల పేరిట పట్టామార్పిడి చేశారు. వాస్తవానికి సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలంటే అగ్రిమెంట్‌ రాసిన వ్యక్తులకు సమాచా రం ఇవ్వాల్సి ఉంటుంది. అతను ఒక వేళ మరణిస్తే అతని వారసులకు సమాచారం ఇచ్చి ఎలాం టి అభ్యంతరం లేకపోతేనే దాన్ని క్రమబద్ధీకరించా ల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవేవి జరగలేదు. కా రణం అధికారుల కాసుల కక్కుర్తేనని తెలుస్తోంది.

భూ రికార్డుల శుద్ధీకరణలో  బయటపడిన అక్రమం
2017లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూరి కా ర్డుల శుద్ధీకరణ కార్యక్రమంలో కేవీఎల్‌ నర్సిం హా రావు వారసులు తమ భూములకు పట్టాదారు పా స్‌పుస్తకాల కోసం దఖాస్తు చేయగా అప్పటికే ఆ భూమి ఇతరుల పేరుమీదకు మారడంతో లబోది బోమంటూ అధి కారులకు ఫిర్యాదు చేశా రు. కానీ  ఈ విషయంలో కావాలనే ఇతరులకు సాయం చేసిన అధికారులు అసలు పట్టా దా రుల గోడు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దరఖాస్తుల మీద దరఖాస్తులు పెడుతున్నా  కాళ్లు అరిగేలా కా ర్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. మరో పక్క అక్రమార్కులు మాత్రం నిర్భయంగా  ప్రభుత్వం  అందజేస్తున్న రైతుబంధు సాయాన్ని తీసుకొంటున్నారు. అధికారులే అక్రమార్కులను రెచ్చగొట్టి  తమ భూముల మీదకు తోలుతున్నారని, మీరే దు న్నుకోమని వారికి చెబుతూ , «ఫిర్యాదు చెయ్యండి విచారిస్తామని మాకు చెబుతూ డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని   పట్టాదా రులు ఆరోపిస్తున్నారు.

ఇలానే మరికొన్ని...
ఇదే గ్రామ రెవెన్యూ పరిధిలో మరికొన్ని సర్వే నం బర్లలో కూడా  వీరు అక్రమ పట్టామార్పిడి చేసిన ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అసలు ప ట్టాదారులు అడిగితే తమ ఉన్నతాధికారి  చెయ్యమన్నాడు... మేము చేశాం.. మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు. ఇలా సుమారు  20ఎకరాల్లో వీరు అక్రమాలకు పాల్పడి రూ.లక్షలు  దొడ్డిదారిన దోచుకున్నారని దీనిపై  ఉన్నతాధికారులు  విచారణ జరిపి ఇంటి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తీవ్ర అన్యాయం చేశారు
త్రిపురవరం గ్రామంలో మాకు భూములు ఉన్నాయి. వృత్తి రీత్యా  మేము విదేశాలు,  ఇతర రాష్ట్రాల్లో  ఉంటున్నాం. ఇటీవల భూశుద్ధి  కార్యక్రమంలో  మా భూములకు పటా ్టదారు పుస్తకాల కోసం దరఖాస్తు చేయగా ఆభూములను అప్పటికే స్ధానిక రెవెన్యూ అధికారులు ఇతరులకు అక్రమంగా పట్టా చేశారు. దీనిపై ఫిర్యాదు చేయగా మీరు భూ మి మీద లేరంటూన్నారు. ఇతర దేశాల్లో ఉన్న వారు భూమి వద్ద ఎలా ఉంటారో అధి కారులే చెప్పాలి.  దీని కోసం ఉద్యోగాలను వదిలి కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిప్పుతున్నారు. ఉన్నతాధికారులు  దీనిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి.
 – కొమరగిరి గోపాలకిషన్‌రావు, పట్టాదారుల వారసుడు

నేను కొత్తగా వచ్చాను
అనంతగిరి తహసీల్దార్‌గా ఇటీవలనే బాధ్యతలు స్వీకరించా. ఈ భూముల విషయం మా దృష్టికి వచ్చింది.  దీనిపై శనివారం మా సర్వేయర్‌తో సర్వే చేయించాము. సోమవారం వివరాలు తెలుపుతాము. మిగతా భూముల విషయం ఆర్డీఓ  పరిధిలో ఉంది.
– జంగయ్య, తహసీల్దార్, అనంతగిరి.

మరిన్ని వార్తలు