భోపాల్ : అతని భార్యేమో సబ్ ఇన్స్పెక్టర్. కానీ అతను మాత్రం ప్రియురాలితో కలిసి దోపిడీలకు పాల్పడ్డాడు. పైగా తన సతీమణి పోలీస్ డ్రెస్‌ను ప్రియురాలికిచ్చి.. ఫేక్ పోలీస్ ఐడీ కార్డుతో జనాలను అందినకాడికి దోచుకున్నారు. చివరకు కటకటాలపాలయ్యారు. తీరా నిందితుడు ఓ పోలీస్ ఆఫీసర్ భర్తని తెలిసి పోలీసులు హతశులయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వివరాలను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.