మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యం 

30 Aug, 2019 11:45 IST|Sakshi
కుమారస్వామి

 వివాహితకు తాళి కట్టిన వ్యక్తి 

వరుసకు మేనబావ 

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు  

 సాక్షి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చింతర రజిత మెడలో గురువారం జగిత్యాలకు చెందిన చింతల కుమారస్వామి కలెక్టరేట్‌ గేటు ఎదుట తాళికట్టి హల్‌చల్‌ చేసిన సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన రజిత కలెక్టరేట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. రజిత భర్త రమేష్‌ 6నెలల క్రితం మృతి చెందాడు. ఆమెకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వరుసకు మేన బావ అయిన కుమారస్వామికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా రజితను వివాహం చేసుకుంటానని కొంత కాలంగా వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం కలెక్టరేట్‌ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న రజితతో మాట్లాడేందుకు వచ్చిన కుమారస్వామి అకస్మాత్తుగా ఆమెమెడలో తాళికట్టాడు. దీంతో కుమారస్వామిపై మంచిర్యాల పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు  ఎస్సై మారుతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా