వదినను చంపి.. మరిది ఆత్మహత్య

8 Nov, 2019 09:40 IST|Sakshi
మృతి చెందిన శివ, ఆర్ముగం (ఫైల్‌)

చెన్నై ,అన్నానగర్‌: విరుదాచలం సమీపంలో బుధవారం ఇంటి పత్రాల తగాదాలో వదినను కడతేర్చి మరిది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. కడలూర్‌ జిల్లా విరుదాచలం సమీపం మంగలమ్‌పేటకి చెందిన చిన్నస్వామి కుమారుడు కుళందైవేల్‌ (32). ఇతని భార్య శివ (30). వీరికి కుమారులు హరిహరన్‌ (11), ఆకాష్‌ (9) ఉన్నారు. కులందైవేల్‌ తమ్ముడు ఆర్ముగం (28) కార్మికుడు, తల్లి సరోజాతో నివసిస్తున్నాడు. ఆర్ముగం ఇల్లు ముందు భాగం, కులందైవేల్‌ ఇల్లు వెనుక భాగం ఉంది. దీంతో ఆరముగమ్‌కి, శివకి మధ్య ఇంటి పత్రాల విషయంలో తరచూ వివాదం నడుస్తోంది.

బుధవారం కుళందైవేల్, శివ కూలీ పనికి వెళ్లారు. మధ్యాహ్నం శివ భోజనం చెయ్యటానికి ఇంటికి వచ్చింది. అప్పుడు ఆమెకి, ఆర్ముగంకి తగాదా ఏర్పడింది. ఇందులో ఆవేశం చెందిన ఆర్ముగం, వదినపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమవడంతో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. దీంతో భయపడిన ఆర్ముగం భయంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న విరుదాచలం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి, ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉలుందూర్‌పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వివాహం జరిగిన ఐదు రోజుల్లో..

కాల్చేసిన వివాహేతర సంబంధం

ప్రాణాలను పణంగా పెట్టి బైక్‌ రేసింగ్‌

ఫోన్‌ చేసి వివరాలు పట్టి.. ఖాతాల్లో సొమ్ము కొల్లగొట్టి..

సురేఖ హత్య కేసు.. హంతకునికి యావజ్జీవం

బంధువే సూత్రధారి..!

సినిమాల పేరుతో వ్యభిచార కూపంలోకి

మాయమాటలతో.. వారం రోజులపాటు..!!

ఆమె ఇంట్లో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు

నలుగురు సినీ ప్రేక్షకులపై కేసు

వంట బాగా చేయలేదన్నాడని..

కర్ణాటక లీగ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌!

ఏసీబీ వలలో డీపీఓ రవికుమార్‌

వీసాల మోసగాళ్ల అరెస్టు

మీకూ విజయారెడ్డి గతే!

తహసీల్దార్‌ హత్య కేసు నిందితుడు మృతి

సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు

ఉద్యోగాల పేరుతో మోసం

సురేష్‌ మృతి.. స్పందించిన తండ్రి

2500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం

మృత్యు దారులు.. ఎన్నో ప్రమాదాలు..

‘అవును ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు’

ఇంటి దొంగను ‘ఈశ్వరుడే’ పట్టుకున్నాడు!

లైంగిక ఆరోపణలు: అవమానభారంతో ఆత్మహత్య

గంజాయి సరఫరా డోర్‌ డెలివరీ..

పెళ్లివారింట విషాదం

అద్దెకు తీసుకుని అమ్మేస్తారు..

భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా

విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్‌ మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తీన్‌మార్‌?

ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు 

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

పూల మాటుల్లో ఏమి హాయిలే అమలా...

యాక్టర్‌ అయినంత మాత్రాన విమర్శిస్తారా?

డబ్బే ప్రధానం కాదు