మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు

12 Sep, 2019 11:44 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి(పాలకొల్లు) : మద్యం మత్తు ఆ కుటుంబంలో చిచ్చురేపింది. తాగిన మైకంలో ఓ తమ్ముడు క్రికెట్‌ బాట్‌తో అన్న తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన పాలకొల్లు మండలం చందపర్రులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మద్యానికి బానిసలైన దేవాబత్తుల ప్రభాకరరావు (48) అతని సోదరుడు సుభాకర్‌ మంగళవారం రాత్రి కూడా ఫూటుగా మద్యం సేవించారు. వీరు ఇద్దరూ కలిసి తాగడం అలవాటుగా చేసుకున్నారు. వారి మధ్య కుటుంబ కలహాలు కూడా ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. దీంతో ఉక్రోషంతో తమ్ముడు సుభాకర్‌ అందుబాటులో ఉన్న క్రికెట్‌ బ్యాట్‌ తీసుకుని ప్రభాకరరావుపై దాడి చేశాడు. తలపై క్రికెట్‌ బ్యాట్‌తో బ లంగా మోదడంతో ప్రభాకరరావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉద యం ప్రభాకరరావు మరణించాడు.  

తల్లి సమక్షంలోనే కొట్లాట : ప్రభాకరరావు, సుభాకర్‌ ఇద్దరూ కొట్లాడుకునే సమయంలో తల్లి నెలసనమ్మ అక్కడే ఉంది. అన్నయ్యను కొ ట్టవద్దని వారిస్తున్నా మద్యం మత్తులో ఉన్న సుభాకర్‌ ఆమె మాట పట్టించుకోలేదు. మృ తుడు ప్రభాకరరావు భార్య కృష్ణవేణి ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లింది. అతని కుమారుడు సుకుమార్‌  పట్టణంలోని ప్రైవేట్‌ స్కూల్లో తొ మ్మిదో తరగతి చదువుతున్నాడు.

పరారీలో నిందితుడు
వీఆర్వో మీసాల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్సై పి.అప్పారావు ఘటనాస్థలానికి వచ్చి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభాకరరావును హత్య చేయడానికి ఉపయోగించిన క్రికెట్‌ బ్యా ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త మ్ముడు సుభాకర్‌ పరారీలో ఉన్నాడు. రూరల్‌ సీఐ డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు