భార్యతో అక్రమ సంబంధం వద్దన్నందుకు..

1 Jan, 2020 10:12 IST|Sakshi
భర్త కృష్ణన్‌ (ఫైల్‌) ప్రియుడు రామచంద్రన్‌

భర్తను హత్య చేసిన ప్రియుడు  

చెన్నై, సేలం: భార్యతో అక్రమ సంబంధాన్ని వదులుకోమని కోరిన భర్తను దారుణంగా హత్య చేసి, పరారైన ప్రియుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నామక్కల్‌ జిల్లా రాశిపురం సమీపంలోని వెన్నందూరుకు చెందిన కృష్ణన్‌ (55) సెంట్రింగ్‌ పని చేస్తున్నాడు. ఇతని భార్య వసంతి (45) టైలరింగ్‌ దుకాణం నడుపుతోంది. వీరికి కుమారుడు మోహన్‌ (25) ఉన్నారు. కొన్ని నెలల క్రితం కృష్ణన్‌కు సేలం జిల్లా చిన్నప్పన్‌పట్టికి చెందిన జ్యోతిష్కుడు రామచంద్రన్‌ (35)తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి రామచంద్రన్‌ అప్పుడప్పుడు కృష్ణన్‌ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అప్పుడు రామచంద్రన్‌కు కృష్ణన్‌ భార్య వసంతికి అక్రమ సంబంధం ఏర్పడింది.

కృష్ణన్‌ ఎంత చెప్పినా రామచంద్రన్‌ వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హెచ్చరించినా రామచంద్రన్‌ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇదేవిధంగా రామచంద్రన్‌ సోమవారం రాత్రి కూడా వసంతితో మాట్లాడాలంటూ కృష్ణన్‌ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉండడం వల్ల అతనికి నచ్చజెప్పి ఊరికి పంపించడానికి అతడిని కృష్ణన్, మోహన్‌లు బస్టాండ్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో అతని వద్ద ఉన్న కత్తితో కృష్ణన్‌ను రామచంద్రన్‌ పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణన్‌ను సేలం జీహెచ్‌కు తరలించగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం కృష్ణన్‌ను అరెస్టు చేశారు. వెన్నందూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా అంటూ కొట్టిచంపారు

పాపం మందుబాబు.. ఆరుసార్లు ఓటీపీ చెప్పి..

కూలి డబ్బులు అడిగినందుకు.. కార్మికులపై దాడి 

కోల్‌కతాలో అగ్ని ప్ర‌మాదం

కరోనా : ఇంట్లోకి రానివ్వకపోవడంతో

సినిమా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించారా? 

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం

జూన్‌లో మోసగాళ్ళు