పసిబిడ్డపై తండ్రి పైశాచికత్వం

10 Nov, 2019 04:37 IST|Sakshi
పుల్లయ్య (ఫైల్‌), మృతిచెందిన చిన్నారి

తన పోలికలతో లేడని పసికందు ప్రాణాలు తీసిన తండ్రి 

రోకలిబండతో భార్యపై దాడి 

ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న అర్ధాంగి  

మొదటి భార్యనూ ఇలానే హత్యచేసి జైలుకు..  

ప్రకాశం జిల్లాలో కలకలం

బోసి నవ్వులు కురిపిస్తున్న ఆ పసిబిడ్డను చంపడానికి ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో.. తన పోలికలతో లేడంటూ అత్యంత కిరాతకంగా ఆ చిన్నారి ప్రాణాలు తోడేశాడు. నేలకేసి కొట్టి.. ఆపై గొంతుమీద కాలేసి తొక్కి పసివాడి ఉసురుతీశాడు. అనుమానం పెనుభూతమై.. అతడిని రాక్షసుడిని చేసింది.. 

రాచర్ల: రాచర్లకు చెందిన గుమ్ముళ్ల చిన్న పుల్లయ్య.. 2009లో అర్థవీడు మండలం, మొహిద్దీన్‌పురానికి చెందిన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, ఒక కుమార్తె సంతానం. 2011లో పుట్టింటికి వెళ్లి రెండో సంతానానికి జన్మనిచ్చిన లక్ష్మీదేవి బాలింతగా ఉండగానే ఆమెపై అనుమానం పెంచుకుని.. కిరాతకంగా హత్యచేశాడు. ఈ కేసులో అప్పట్లో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక 2017లో వెఎస్సార్‌ జిల్లా రామాపురానికి చెందిన రమాదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. బేల్దారి పనులు, కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఎనిమిది నెలల కుమారుడు రేవంత్‌ ఉన్నాడు. బిడ్డ పుట్టినప్పట్నుంచి.. తన పోలికలతో లేడని నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు.

శుక్రవారం రాత్రి ఇదే విషయంపై మళ్లీ వేధించాడు. శనివారం ఉదయం కూడా భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంచంపై ఉన్న రేవంత్‌ను తీసుకుని నేలకేసి కొట్టాడు. అది చాలదన్నట్టు గొంతుపై కాలేసి తొక్కి హతమార్చాడు. కన్న బిడ్డను కళ్ల ముందే చంపేస్తుండటం చూసి హతాశురాలైన రమాదేవి కేకలు వేస్తూ ఇరుగు పొరుగును పిలిచింది. దీంతో మరింత రెచ్చిపోయిన పుల్లయ్య పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని ఆమె తలపై బలంగా మోదాడు. తీవ్ర గాయాలతో ఆమె కేకలు వేస్తూ వీధిలోకి వచ్చి కుప్పకూలిపోయింది. బిడ్డ అప్పటికే మరణించాడు. అది చూసి పుల్లయ్య అక్కడ నుంచి పరారయ్యాడు. ఇరుగుపొరుగు వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న రమాదేవిని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రమాదేవి సోదరులు శ్రీరాములు, అంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని రమాదేవి తల్లిదండ్రులకు అప్పగిస్తామని సీఐ సుధాకర్‌రావు చెప్పారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

తప్పిపోయిన అమెరికా టూరిస్ట్‌​, తిరిగి గోవాలో..

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

నవ వధువు..ఇవి వద్దు అంటూ వేడుకుంది..

ఆ విధికి కన్నుకుట్టిందేమో..

భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం

రంగుల వల.. చెదిరే కల

అసలు సూత్రధారి ఎక్కడ?

కిలాడి లేడి; గవర్నర్‌ సంతకం నుంచి మొదలుపెట్టి..

సహజీవనం: మరొకరితో సన్నిహితంగా ఉందనే నెపంతో..

పౌడర్‌ డబ్బాపై పడి చిన్నారి మృతి 

నకిలీ క్యాట్రిడ్జెస్‌ ప్యాక్‌ చేసి అమ్మేస్తాడు..!

పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మీ కోసం..

‘కిలేడీ’ కేసులో మరో కొత్తకోణం

నకిలీ నగలు తాకట్టు అక్కాచెల్లెలు అరెస్టు

14 మందిని తన వలలో వేసుకుని..

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య?

ఘాట్‌ రోడ్డులో ఘోరం:10మంది దుర్మరణం

ముహూర్తం చూసుకుని..దంపతుల ఆత్మహత్య

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

రెండో భార్యే హంతకురాలు ?

4 కేజీల బంగారు ఆభరణాల చోరీ

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో పేలుడు..

తల్లడిల్లిన తల్లి మనసు

కుమార్తె దావత్‌ కోసం చైన్‌స్నాచింగ్‌

నిర్లక్ష్యం ఖరీదు 10 హత్యలు

వదినను చంపి.. మరిది ఆత్మహత్య

వివాహం జరిగిన ఐదు రోజుల్లో..

కాల్చేసిన వివాహేతర సంబంధం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన తప్పుకు మనదే బాధ్యత

కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్‌ చేయలేం

కొత్త అడుగులు?

రొమాంటిక్‌ రూలర్‌

అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేయాలనుంది

మంత్రిని కలిసిన రాహుల్‌ సిప్లిగంజ్‌