మేక కోసం దాడి చేసిన‌ గ్రామ‌స్తులు

11 May, 2020 20:56 IST|Sakshi

రాంచీ: మేక‌ను ఎత్తుకెళ్లాడ‌న్న కోపంతో గ్రామ‌స్థులు ఓ వ్య‌క్తిని కిరాత‌కంగా కొట్టి చంపారు. ఈ దారుణ‌ ఘ‌ట‌న సోమ‌వారం జార్ఖండ్‌లో జ‌రిగింది. డుమ్కా ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తికి చెందిన మేక క‌నిపించ‌కుండా పోవ‌డంతో ముప్పై ఏళ్ల‌ సుభాన్ మియాన్ అనే వ్య‌క్తి దాన్ని దొంగిలించాడ‌ని భావించాడు. దీంతో కొంత‌మంది వ్య‌క్తుల‌ను పోగేసుకుని అత‌నిపై దాడికి దిగ‌బ‌డ్డాడు. అత‌నితోపాటు ఉన్న దులాల్ మీర్దా అనే మ‌రో వ్య‌క్తిని కూడా చిత‌క‌బాదారు. ఈ దాడిలో సుభాన్ అక్కడికక్క‌డే మ‌ర‌ణించాడు. (మహాలక్ష్మి అత్యాచార ఘటన : ఉరి తీయాలి)

స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి  చేరుకోగా సుభాన్ ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండ‌గా, తీవ్ర గాయాల‌తో చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న దులాల్‌ను డుమ్కాలోని స‌ర్దార్‌ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ దాడికి పాల్ప‌డ్డ‌వారిలో మేక య‌జ‌మాని స‌హా మ‌రో వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ నేరంలో ఎవ‌రెవ‌రు పాల్గొన్నార‌న్న‌దానిపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా మేక పోయింద‌ని అటు గ్రామ‌స్తులు, ఇటు బాధితుల‌పై దాడి రెండింటిపైనా కేసు న‌మోదు చేశామ‌ని ఎస్పీ అంబ‌ర్ ల‌ర్కా తెలిపారు. నిందితుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌ద‌ల‌బోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. (బాలిక గొంతుకోసిన యువకుడు)

>
మరిన్ని వార్తలు