సొంత చెల్లెలిపై అఘాయిత్యం...

25 May, 2020 08:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌ : ఇంటి నుంచి ఆడపిల్ల బయటికి వెళ్తే ఎటునుంచి ఏ ప్రమాదం చుట్టుముడుతుందోనని కుటుంబం... వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. సమాజంలో రెచ్చిపోతున్న మానవ మృగాలు తన, మన బేధం లేకుండా అమ్మాయిలపై ఆకృత్యాలకు ఒడిగడుతున్నారు. సొంత వారికి అండగా నిలవాల్సిన వ్యక్తే ఆ చిన్నారి పాలిట శాపంగా మారాడు. మతిస్థిమితం లేని పదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్‌పై కన్నేసిన వ్యక్తి తోడబుట్టిన వాడే కావడం మరింత సిగ్గుచేటు. ముగ్గురు స్నేహితులతో కలిసి సొంత చెల్లెలిపై 'సాముహిక అత్యాచారానికి తెగబడ్డాడో ఓ ప్రబుద్ధుడు. అనంతరం ఆమె చావుకు కారకుడయ్యాడు. (తోటి కోడళ్ల వివాదం.. గ్రామాల మధ్య ఘర్షణ)

రాజస్థాన్‌లో మే 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జైపూర్‌లోని మనోహర్‌పూర్‌ చెందిన బాలికకు మతిస్థితిమం సరిగా లేదు. ఈ క్రమంలో కూతురు కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గాలింపు చర్యలు ప్రారంభించిన మూడు రోజులకు సమీప అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలికను చివరిసారిగా తన సోదరుడితో చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. సోదరుడిని పోలీసులు విచారించగా స్నేహితులతో కలిసి సాముహిక అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఆమెను గొంతు కోసి చంపినట్లు తెలిపాడు. దీంతో నిందితుడితోపాటు ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా 19 నుంచి 21 వయస్సు కలిగిన వారేనని పోలీసులు తెలిపారు. (మత్తు మందిచ్చి.. బావిలో పడేసి..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా