దారుణం: నిండు గర్భిణిపై అత్యాచారం

17 Dec, 2019 01:19 IST|Sakshi

డిష్‌ రిపేర్‌ పేరిట వచ్చి అఘాయిత్యం 

సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరించాడని ఫిర్యాదు

సాక్షి, కమాన్‌చౌరస్తా: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి నిండు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రూరల్‌ సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలానికి చెందిన మహిళ కుటుంబం కొన్నేళ్లుగా కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌ గ్రామంలో నివాసం ఉంటోంది. ఆమె భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ మధ్యాహ్నం డిష్‌ రిపేర్‌ పేరిట ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వచ్చిన కనపర్తి రామకృష్ణ తొమ్మిది నెలల గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె మెడలోని పుస్తెల తాడు తెగిపోయింది.

కొద్దిసేపటి తర్వాత సదరు మహిళ భర్త ఇంటికి రాగానే పుస్తెలు మళ్లీ కట్టుకుంటూ, బట్టలు చిందరవందరగా పడి ఉండటంతో అనుమానం వచ్చి అడుగగా జరిగిన అఘాయిత్యం గురించి వివరించింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆలోచించారు. చివరకు సోమవారం కరీంనగర్‌ రూరల్‌ పోలీసులకు మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడు కనపర్తి రామకృష్ణపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అత్యాచారం చేసిన సమయంలో నిందితుడు తన సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సమత కేసు: రెండోరోజు కోర్టుకు నిందితులు

వివాహిత దారుణహత్య

అత్యాచార కేసు ప్రధాన నిందితుడు మృతి

స్నాచర్లను పట్టుకుంటే గ్యాంగ్‌ దొరికింది

విషాదం: యువతి దుర్మరణం 

రైల్లో మత్తు మందు ఇచ్చి..

రియల్టర్‌ను హతమార్చిన అన్నదమ్ములు

కళ్లలో కారం చల్లి... కత్తితో నరికి

మాయమాటలు చెప్పి.. బాలికపై లైంగిక దాడి

బావ పరిహాసం.. మరదలు మనస్తాపం

ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు

ఆటో మొబైల్‌ దొంగల ముఠా అరెస్ట్‌: సీపీ

‘ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్‌ ఉద్యోగులు’

నలుగురి ఆత్మహత్యాయత్నం

బాలికపై మాష్టారు లైంగిక వేధింపులు

బంధాలను కాలరాసి.. కత్తులతో దాడిచేసి..

దారుణం : భార్య చేతులు కోసిన ఎంపీడీవో

ప్రాణం తీసిన విద్యుత్‌ తీగలు

కోర్టుకు ‘సమత’ నిందితులు; 44 మందిని..

కేరళలో కరీంనగర్‌ విద్యార్థి మృతి

హైటెక్‌ వ్యభిచారం బట్టబయలు

వేధింపులకే వెళ్లిపోయాడా?

అమ్మా.. నాన్న ఇవే నా చివరి మాటలు

క్షణాల్లో గల్లంతవుతున్న స్మార్ట్‌ ఫోన్లు

ఇక్కడ అమ్మాయి... అక్కడ అబ్బాయి!

బండారు తనయుడి బరితెగింపు  

బషీద్‌ చిల్లర వేషాలు ఎన్నో..

మరదలిని తుపాకితో కాల్చిన బావ

సినీ ఫక్కీలో మోసం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే’

ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..

అందుకే తెలుగులో వీలు కుదర్లేదు

డైరెక్టర్‌ బచ్చన్‌

తెలుగు రాష్ట్రంలో తలైవి

పాత బస్తీలో డిష్యుం డిష్యుం