పట్టపగలే గొడ్డలితో నరికి..

15 Apr, 2019 16:26 IST|Sakshi

సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో పట్టపగలే ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి గొడ్డలితో బీభత్సం సృష్టించాడు. జగిత్యాల టౌన్ లోని విద్యానగర్‌లో 2 గుంటల భూమి విషయంలో తిప్పర్తి కిషన్‌, లక్ష్మణ్‌ల మధ్య వివాదం నడుస్తుంది. రిజిస్ట్రేషన్ డబ్బుల విషయంలో తగాదా మరింత ముదిరింది. ఈ భూమి విషయంలో నష్టపోయానని భావించిన కిషన్‌పై లక్ష్మణ్ పగ పెంచుకున్నాడు. 

ఈ క్రమంలోనే సారుగమ్మ వీధికి వచ్చిన కిషన్‌పై లక్షణ్‌ గొడ్డలితో దాడికి దిగాడు. ఆ సమయంలో అక్కడున్న వారు ఎవరూ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దాడి అనంతరం గొడ్డలిని పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసి లక్ష్మణ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది.  గాయపడిన కిషన్‌ను ఆసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా