మరదలిని తుపాకితో కాల్చిన బావ

16 Dec, 2019 04:49 IST|Sakshi

విశాఖ ఏజెన్సీలో సంఘటన

హుకుంపేట (అరకులోయ): అన్నదమ్ముల మధ్య ఆర్థిక వివాదం నేపథ్యంలో బావ తన మరదలిని తుపాకితో కాల్చి తీవ్ర గాయాలుపాలు చేసిన ఘటన విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ కేంద్రంలో జరిగింది. హుకుంపేట ఎస్‌ఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామంలో కిల్లో కృష్ణ, కిల్లో జయరామ్‌ తమ తండ్రి పేరున ఉన్న భూమిని అన్నదమ్ములు పంచుకోలేదు. అయితే ఇటీవల రైతు భరోసా పథకం కింద జయరామ్‌ ఖాతాలో సొమ్ము జమైంది. ఈ సొమ్ము కోసం అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొనడంతో ఆదివారం ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో కిల్లో కృష్ణ తన వద్ద ఉన్న నాటు తుపాకితో కాల్పులు జరపడంతో అతని తమ్ముడి భార్య కొండమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశార

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు