నమ్మించి గొంతుకోశాడు..

15 Nov, 2019 07:46 IST|Sakshi

బావమరిదిని హతమార్చిన బావ

అక్కను చూసేందుకు వచ్చిన తమ్ముడు

బైక్‌పై తీసుకువెళ్లి ఘాతుకం

సాక్షి, ఆదిలాబాద్‌ : అక్కను చూసేందుకు వచ్చి బావ చేతిలో బావమరిది హతమైన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని దహేలిలో నివాసముంటున్న నర్సమ్మ – దత్తుల కూతురు మమతను ఆదిలాబాద్‌ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన ఓసావార్‌ సంతోష్‌తో పదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకోగా అక్కతో కలిసి మనోజ్‌ (25) బావపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏడాది నుంచి అక్కాబావలు కలిసి ఉంటున్నారు. గురువారం తన అక్కను చూసేందుకు వచ్చాడు. అక్కతో పాటు ఆమె పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. బావ సంతోష్‌ బావమరిదిని టీ తాగేందుకు ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకువెళ్లాడు.

మమత జిన్నింగ్‌ ఫ్యాక్టరీ దగ్గరికి రాగానే బైక్‌ నడుపుతున్న మనోజ్‌ను కత్తితో వెనకనుంచి మెడను కోశాడు. ఆ తర్వాత కడుపులో పలుమార్లు పోడవడంతో మనోజ్‌ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని అక్క కన్నీరుమున్నీరుగా విలపించింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, వన్‌టౌన్, టూటౌన్‌ సీఐలు చేరుకొని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

15 కేసులు.. అయినా మారని తీరు

అది ఆత్మహత్యే

మత్తుమందిచ్చి స్నేహితుడి భార్యపై..

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్‌ మృతి

బిల్లు చెల్లించమంటే చెవి కొరికాడు..

పాతకక్షలతో మహిళ దారుణ హత్య

పట్టాలపై మందు పార్టీ

కూతురిని అమ్మేశాడు

ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్‌.. రూ.4లక్షలు మాయం

చెట్టు నుంచి దూరం చేయడంతో చితక్కొట్టారు

ఆటోను ఢీకొన్న యువనేత బీఎండబ్ల్యూ..

‘దారుణంగా కొట్టాడు.. సాయం చేయండి ప్లీజ్‌’

స్టీరింగ్‌ విరిగి.. పక్కకు ఒరిగి

పట్టుకోండి చూద్దాం!

బంగారం అనుకొని దోచేశారు

పట్టాలపై చితికిపోయిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు

నయా మోసగాళ్లు..

నిద్రమత్తు తెచ్చిన అనర్థం

నవ్వినందుకు చితకబాదాడు

కళ్లల్లో పెప్పర్‌ స్ప్రే కొట్టి రూ.30లక్షలు దోపిడీ

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

ప్రొఫెసర్ల వేధింపులతో బలవన్మరణం

మహిళ మెడ నరికి హత్య

వెట్టి చాకిరి కేసులో 17 ఏళ్ల జైలు

సినీ హీరో రాజశేఖర్‌కు గాయాలు

మత్తులో ట్రావెల్స్‌ డ్రైవర్, కండక్టర్‌ 

కుమారుడి పెళ్లి వేడుకలో.. తండ్రి హత్య!

మొండం లేని మహిళా మృతదేహాం లభ్యం

నా భార్యను మోసం చేస్తున్నాను.. అందుకే ఇలా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్ని తెర తారలకు టిక్‌టాక్‌ క్రేజ్‌

క్షేమంగానే ఉన్నాను

అమలా ఔట్‌?

సినిమాలు అవసరమా? అన్నారు

మహోన్నతుడు అక్కినేని

ప్రేక్షకులను అలా మోసం చేయాలి