దయ్యం పట్టిందని.. భయం భయంగా ఉందని..

8 Sep, 2018 11:43 IST|Sakshi
ఘటనా స్థలంలో పరిశీలిస్తున్న స్థానికులు, జంపయ్య మృతదేహం

కారేపల్లి : ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పొలంలో పడేసిన ఘటన మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండటంతో ఇది ముమ్మాటికీ హత్యేనని..స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఎర్రబోడు గ్రామానికి చెందిన పాయం జంపయ్య (32) కూలి పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తుండగా, భార్య పద్మ స్థానికంగా అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తుండేది.

కాగా..ఏడాది క్రితం ఆమె గర్భిణిగా ఉండి అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఏడు సంవత్సరాల కుమారుడు యశ్వంత్‌ ఉన్నాడు. పిల్లాడితో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే కూలి పని చేసుకొని జీవిస్తున్నాడు. అప్పుడప్పుడూ ఎర్రబోడుకు వచ్చి తన తల్లి కౌసల్య, తమ్ముడు రంగయ్య వద్ద రెండు మూడు రోజులు గడిపి తిరిగి వెళ్లేవాడు. కాగా..10 రోజుల క్రితం కుమారుడు యశ్వంత్‌తో ఎర్రబోడుకు వచ్చిన జంపయ్య మూడు రోజుల క్రితం కుమారుడిని తన అత్తగారి ఊరైన ఇల్లెందు మండలం నాయకన్‌గూడెం గ్రామంలో వదిలేసి వచ్చాడు. అప్పటి నుంచి ఎర్రబోడులోనే ఉంటూ..మద్యం సేవిస్తూ, మానసికంగా మదనపడుతూ, తనకు దయ్యం పట్టిందని, భయం భయంగా ఉందని, ఇంట్లో వారితో గొడవ పడుతుండే వాడు.

ఈ క్రమంలోనే గురువారం రాత్రి గ్రామంలో ఉన్న ఓ బెల్టు దుకాణం వద్ద మద్యం సేవించి బయటికి వెళ్లిన జంపయ్య శుక్రవారం మధ్యాహ్నం ఎర్రబోడు చెరువు సమీపంలో ఉన్న ఓ రైతు పొలంలో శవమై కన్పించాడు. ముఖం భాగంలో తీవ్రంగా రాయితో కొట్టినట్లు, చెయ్యి, కాలు మడెమల వద్ద విరిగిన భాగాలతో పాటు తీవ్ర రక్తస్రావం అయ్యి ఉండటం, తన చొక్కాతోనే ఉరి బిగించి చంపినట్లు..ఘటన స్థాలంలో స్పష్టంగా ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. ఎర్రబోడు చెరువు సమీపంలో హత్యచేసి, ఆ పై మృతదేహాన్ని ఈడ్చుకొచ్చి ఇవతల వైపు ఉన్న పొలాల్లో వేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ముమ్మాటికీ హత్యేనని, జంపయ్య ఎవరితో గొడవ పడే వ్యక్తి కాదని, సౌమ్యుడిగా పేరుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాగా..ఆస్తి తగదాల విషయంలో ఏమైనా గొడవలు జరిగి..హత్యకు పాల్పడి ఉంటారా..? లేక.. ఇటీవల చేతబడి వంటి అపోహలు గ్రామంలో ఎక్కువగా విన్పిస్తుండటం..మృతుడి ముఖం భాగంలోనే రాయితో కొట్టి దంతాలు ఊడే విధంగా చేసి ఉండటం వంటి ఆనవాళ్లు..గ్రామస్తుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాయచూరులో మరో నిర్భయ ఘటన? 

అంతుచూసిన అనుమానం

పెళ్లయిన రెండు నెలలకే..

రైల్వే పోలీసుల అదుపులో టీడీపీ నాయకుడు

ఒంటరి మహిళలకు మాయ మాటలు చెప్పి...

ఒత్తిడి.. ఉక్కిరిబిక్కిరి!

మహిళపై సామూహిక అత్యాచారం

యువతిపై ప్రియుడి తల్లి కత్తిదాడి

కన్న కొడుకును చూడకుండానే..

ఆన్‌లైన్‌ మోసం..!

పెనుకొండలో కిడ్నాప్‌ కలకలం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

అటవీ ప్రాంతంలో దారుణం.. మహిళ తలపై..

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

ప్రభుత్వాస్పత్రులే అడ్డాగా.. పిల్లల అక్రమ రవాణా! 

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు బౌన్స్‌

వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని దాడులు

రాజధానిలో మళ్లీ ఐసిస్‌ కలకలం

నలుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య

జూ పార్క్‌లో కూలిన భారీ వృక్షం.. మహిళ మృతి

జ్యోత్స్న మృతి కేసు : అంకుర్‌, పవన్‌ల అరెస్ట్‌

కర్నూలులో ఘోర ప్రమాదం

అపూర్వను గుడ్డిగా నమ్మాను : ఎన్డీ తివారి భార్య

సీఎం రమేష్‌ మేనల్లుడు ఆత్మహత్య

పండుగకు వెళ్తూ పరలోకానికి

కొల్లేరు లంక గ్రామాల్లో అశ్లీల నృత్యాలు 

గుప్పు.. గుప్పుమంటూ..

కాయ్‌ రాజా కాయ్

ప్రాణం తీసిన మద్యం వివాదం

హత్యాయత్నం కేసుపై డీఎస్పీ దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు రిషి, రైటర్‌ స్వాతిల నిశ్చితార్థం

అక్కడా మీటూ కమిటీ

మరోసారి జోడీగా...

కాపాడేవారెవరు రా?

రాణి పూంగుళలి

గ్యాంగ్‌ వార్‌