ఇద్దరి మధ్య ఘర్షణ... మధ్యలో వెళ్లిన వ్యక్తి మృతి

4 Nov, 2019 10:32 IST|Sakshi
గాంధీ హట్స్‌లో బందోబస్తు , రమేష్‌ గౌడ్‌(ఫైల్‌)

మారేడుపల్లి : ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురైన సంఘటన మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ మట్టయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.జేబీఎస్‌ బస్టాండ్‌ సమీపంలోని గాంధీహట్స్‌లో  ఉంటున్న నరేష్‌ శనివారం రాత్రి మల్లన్న గుడి వద్ద ఉన్న స్నేహితులకు కొద్ది దూరం నుంచి చెయ్యి ఊపుతూ హాయ్‌ అంటూ సైగ చేశాడు. ఆదే సమయంలో శుభకార్యానికి వెళ్లేందుకు చోటు ఆలియాస్‌ మహ్మద్‌ ఇస్మాయిల్‌ అనే వ్యక్తి తన భార్య, బిడ్డలతో ఇంటి ముందు నిల్చుని ఉన్నాడు. నరేష్‌ తన కుటుంబసభ్యులకే హాయ్‌ చెప్పాడని భావించిన ఇస్మాయిల్‌  అతడి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిని గుర్తించిన నరేష్‌ మేనమామ రమేష్‌ గౌడ్‌ (39) బయటికు వచ్చి వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు.

దీంతో ఆగ్రహానికి లోనైన ఇస్మాయిల్‌  ఒక్కసారిగా రమేష్‌గౌడ్‌పై దాడి చేయడంతో అతను కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని  ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇస్మాయిల్‌ పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  గాంధీ హట్స్‌లో ఉద్రిక్తత రమేష్‌ గౌడ్‌ మృతితో గాంధీ హట్స్‌ లో ఉద్రిక్తత నెలకొంది. మృతుని బంధువులు, నిందితుడి సంబందీకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సీఐ మట్టయ్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి నుండి ఆదివారం రాత్రి వరకు పికెటింగ్‌ను కొనసాగించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్వారెంటైన్‌లో వ్యాపారవేత్త ఆత్మహత్య

ప్రధాన మంత్రి విరాళాలు కొల్లగొట్టడానికి..

యువతుల్ని వేధించిన 'డ్రీమ్‌ బాయ్‌'

లాక్‌డౌన్‌.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు

లాక్‌డౌన్‌ : మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

సినిమా

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...