వ్యక్తి దారుణ హత్య

15 Sep, 2018 11:10 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ సుబ్బారావు, (ఇన్‌సెట్‌) హత్యకు గురైన మొగిలిరెడ్డి

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్తూరు డీఎస్పీ

పోలీసు జాగిలంతో కీలక     సమాచారం

భార్యపై అనుమానంతో విచారణ

వివాహేతర సంబంధమే కారణమా..?

చిత్తూరు, తవణంపల్లె: మండలంలోని వెంగంపల్లె సమీపంలోని మామిడి తోపులో గురువారం రాత్రి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. వెంగంపల్లెకు చెందిన మొగిలిరెడ్డి(45) వ్యవసాయంతో పాటు మామిడి కాయలు వ్యాపా రం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి వెంగంపల్లె సమీపంలో మామిడి తోపు ఉంది. పాడి ఆవు ఈనుతుందని భావించిన మొగిలిరెడ్డి, అతని భార్య మమత గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మామిడి తోపు వద్ద కు వెళ్లారు. అక్కడే నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మొగిలిరెడ్డి తల, శరీరంపై కొట్టారు. అనంతరం గుడ్డతో గొం తు బిగించి హత్య చేశారు. శుక్రవారం ఉదయం కొడుకు రోహిత్‌రెడ్డి మామిడి తోపు వద్దకు వెళ్లి చూడగా తండ్రి మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. వెంటనే పక్క పొలంలోనే ఉన్న మేనత్త రాజమ్మకు, బంధువులకు తెలిపాడు. సమాచారం అందుకున్న చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు, చిత్తూరు ఈస్ట్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు పరిశీలించారు.

వివాహేతర సంబంధమే కారణమా..?
పోలీసు జాగిలం హత్యా స్థలం నుంచి నేరుగా హతుడి ఇంటి వద్ద తలుపు, బాత్‌రూం వద్దకు వచ్చి ఆగింది. డీఎస్పీ సుబ్బారావు నేతృత్వంలో మొగిలిరెడ్డి భార్య మమత, కూతురు భార్గవి, కుమారుడు రోహిత్‌ రెడ్డి, గ్రామస్తులను వేర్వేరుగా విచారించారు. తాను మంచం పక్కనే పడుకున్నానని, చీకటిలో భర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో భయపడి పరుగులు తీశానని భార్య పోలీసులకు తెలిపింది. పోలీసులు మాత్రం హత్యకు భార్య వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్య, మరో వ్యక్తిని విచారిస్తున్నారు. త్వరలో కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అక్క రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉమామహేశ్వర రావు తెలిపారు.

మరిన్ని వార్తలు