‘సూరత్‌’ రియల్‌ హీరో

26 May, 2019 06:27 IST|Sakshi
విద్యార్థులను కాపాడిన కేతన్‌ జొరవాడియా

ప్రాణాలకు తెగించి ఇద్దరు విద్యార్థులను కాపాడిన కేతన్‌

భవన యజమాని అరెస్ట్‌

అదనపు సీఎస్‌ నేతృత్వంలో విచారణ

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న కోచింగ్‌ సెంటర్‌లో అన్నివైపుల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. చాలామంది విద్యార్థులు ప్రాణాలు దక్కించుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి దూకేస్తున్నారు. ఈ సందర్భంగా అందరిలానే తప్పించుకున్న కేతన్‌ జొరవాడియా అనే యువకుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థులు అంతెత్తు నుంచి నేలపై పడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించాడు.

తొలుత మంటల్లో చిక్కుకున్న 4వఅంతస్తు నుంచి సన్నటి తాడు సాయంతో కేతన్‌ మూడో అంతస్తుపైకి దిగాడు. అక్కడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకునే అవకాశమున్నప్పటికీ  కేతన్‌ అక్కడే ఉండి మంటల్లో చిక్కుకున్న విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా భయంతో బిక్కచిక్కిపోయిన ఇద్దరు యువతులు కిందకు పడిపోకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వీరిని కాపాడారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కేతన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

22కు చేరుకున్న మృతులు
తక్షశిల కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో 20 మంది చనిపోగా, శనివారం మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. ఈ విషయమై సూరత్‌ ఏసీపీ పీఎల్‌ చౌధరి మాట్లాడుతూ.. మృతుల్లో 18 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారని తెలిపారు. ఓ నాలుగేళ్ల చిన్నారికి కూడా ఈ సందర్భంగా కాలిన గాయాలయ్యాయని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువమంది 18 ఏళ్లలోపువారే. కోచింగ్‌ సెంటర్‌లో తగిన సౌకర్యాలు లేవని పేర్కొన్నారు.  

భవన యజమాని అరెస్ట్‌..
పలువురు విద్యార్థుల మృతికి కారణమైన భవన యజమాని భార్గవ్‌ బుటానిని అరెస్ట్‌ చేశామని ఏసీపీ పీఎల్‌ చౌధరి తెలిపారు. ‘సరైన వసతులు లేకుండా, ప్రమాద సమయాల్లో తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఈ భవనాన్ని నిర్మించారు. భార్గవ్‌తో పాటు ఈ భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బిల్డర్లు హర్షుల్‌ వెకరియా, జిగ్నేశ్‌ పరివాల్‌లపై కేసు నమోదుచేశాం. భార్గవ్‌ను ఇప్పటికే అరెస్ట్‌ చేయగా, ఇద్దరు బిల్డర్లు పరారీలో ఉన్నారు.

ఈ దుర్ఘటనలో చనిపోయినవారిలో ముగ్గురు విద్యార్థులు శనివారం వెలువడ్డ 12వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. యశ్వీ కేవదీయా 67శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, మాన్సీ వర్సని 52 శాతం, హస్థీ సురానీ  69శాతం మార్కులతో పాసయ్యారు’ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లలో అగ్నిప్రమాదాల సందర్భంగా తప్పించుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయా? అనే విషయమై ఆడిట్‌ చేపట్టాలని సీఎం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే సూరత్‌ అగ్నిప్రమాదంపై అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు.


మృతులకు నివాళులర్పిస్తున్న సూరత్‌ విద్యార్థినులు
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తాని చెప్పి లాడ్జిలో..

అసెంబ్లీ బాత్రూంలో గొంతు కోసుకుని

స్వామీజీకి వింత అనుభవం!

పురుగుల మందు తాగినీటి గుంటలో పడి..

నా సెల్‌ నంబర్‌ బ్లాక్‌ చేశారు

ప్రేమ జంటలను ఉపేక్షించేది లేదు..

ఆ దంపతులు ప్రభుత్వ ఉద్యోగులైనా..కాసుల కోసం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి 

తెల్లవారితే దుబాయ్‌ ప్రయాణం

యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ వికృత చర్య

సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

ఉలిక్కిపడిన చిత్తూరు 

ప్రాణాలు తీస్తున్న ఈత సరదా

బెం‘బ్లేడ్‌’ ఎత్తిస్తూ..

ఘరానా మోసగాళ్లు అరెస్టు..

పర్సు కొట్టేసిన ఎయిరిండియా పైలట్‌

పీకలదాకా తాగి నడిరోడ్డుపై న్యూసెన్స్‌

భర్తను గట్టిగా ఓ చెంపదెబ్బ కొట్టిందంతే..

ఆధిపత్య పోరు.. ఆలయం కూల్చివేత

దమ్‌ మారో దమ్‌!

అఖిల్‌ ఎక్కడ?

భార్యను చంపి, ఉప్పు పాతరేసి..

కామాంధుల అరెస్టు 

చిత్తూరులో దారుణం.. నాటుబాంబు తయారు చేస్తుండగా!

అందువల్లే నా తమ్ముడి ఆత్మహత్య

ఒంగోలు ఘటనపై స్పందించిన హోంమంత్రి

బోయిన్‌పల్లిలో దారుణం..

ఘోరం: టెంట్‌కూలి 14 మంది భక్తులు మృతి

రాజధానిలో ట్రిపుల్‌ మర్డర్‌ కలకలం

‘లెట్స్‌ డూ నైట్‌ అవుట్‌’ అన్నారంటే.. !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరు అభిమానులకు గుడ్‌న్యూస్‌

‘ఫోన్‌ లోపల పెట్టు.. లేదంటే పగలగొడతాను’

పూరీ ఆ సినిమాలో నటించారా? వర్మ ట్వీట్‌..

‘ఇస్మార్ట్ శంకర్’కు చార్మినార్‌ ఎస్సై ఫైన్‌

‘కల్కి’.. మాకు ఈ ఎదురుచూపులేంటి?

అదరగొట్టిన ప్రీ టీజర్‌.. వరుణ్‌ లుక్‌ కేక