ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం రేపిన వ్యక్తికి రిమాండ్‌

8 Jul, 2019 13:05 IST|Sakshi
నిందితుడు విశ్వనాథన్‌ను చూపిస్తున్న పోలీసులు

సాక్షి, శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరుతున్న విమానాల్లో బాంబులున్నాయంటూ  తప్పుడు సమాచారం అందించి కలకలం సృష్టించిన కేవీ విశ్వనాథన్‌ను ఆదివారం ఆర్‌జీఐఏ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. చెన్నైకి చెందిన విశ్వనాథన్‌ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై మానసికస్థితి సరిగా లేకపోవడంతో శనివారం ఉదయం చెన్నై వెళ్లే విమానాల్లో బాంబులున్నాయంటూ అధికారులకు సమాచారం అందించిన సంగతి తెలిసిందే.

విమానాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు చెన్నై వెళ్లడానికి అక్కడే వేచి ఉన్న కేవీ విశ్వనాథన్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అంతా ఉత్తిదేనని తేలింది. మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో పాటు సంచలనం సృష్టించాలనే ఆలోచనతో అతడు తప్పుడు సమాచారం అందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. భద్రతకు భగ్నం కలిగించే ప్రయత్నంతో పాటు ఉద్యోగుల విధులకు ఆటంకం, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసినందుకు అతడిపై పౌర విమానయాన చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆర్‌జీఐఏ సీఐ రామకష్ణ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు