కూకట్‌పల్లిలో కలకలం.. ఏటీఎం పేల్చివేత

12 Feb, 2018 07:54 IST|Sakshi
కాలిపోయిన ఏటీఎం, లెటర్‌ చూపిస్తున్న వ్యక్తి

తన సూచనలు లేఖలో రాసి పెట్టిన నిందితుడు

అవి అమలు చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు

సాక్షి, హైదరాబాద్‌ : ఓ గుర్తు తెలియని వ్యక్తి పేలుడు పదార్థాల సహాయంతో ఏటీఎం సెంటర్‌లో రెండు సీసీ కెమెరాలు, ఏటిఎం మిషన్‌ను పేల్చివేసి ఓ లేఖను వదిలి వెళ్లిన సంఘటన ఆదివారం కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. సీఐ కుషాల్కర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మొహానికి రుమాలు కట్టుకుని కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్‌ 1లో ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ ఏటిఎంలో ప్రవేశించిన ఓ యువకుడు ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో పేలుడు పదార్ధాలు, విద్యుత్‌ తీగల సహాయంతో ఏటిఎం మిషన్‌లోని రెండు సీసీ కెమెరాలు, ఏటిఎం మిషన్‌ను పేల్చివేశాడు.

అనంతరం తనతో పాటు తీసుకువచ్చిన లేఖను అక్కడే వదిలివేసి వెళ్లి పోయాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలకు పరిష్కార మార్గాలు సూచించాడు. తన లేఖలోని అంశాలను ప్రచారంలోకి తీసుకురాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు.  స్వల్పంగా యంత్రం దగ్ధమైనప్పటికి ఎలాంటి నష్టం జరగలేదని, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందు కు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన లేఖను 24 గంటల్లోపు మీడియాలో ప్రచారం చేయాలని లేనిపక్షంలో ఆత్మహత్యకు పాల్పడతానని పేర్కొనడం గమనార్హం. 

మరిన్ని వార్తలు