జైలుకు వెళ్లినా బుద్ధిమారలేదు

25 Dec, 2017 06:38 IST|Sakshi

బనశంకరి : జైలుకు వెళ్లినా ఓ కామాంధుడు తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు. తన దగ్గరకు రావాలంటూ ఓ మహిళను వేధింపులకు దిగిన సంఘటన బ్యాటరాయనపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు... బ్యాటరాయనపుర మురికివాడలో సెల్వకుమార్‌ నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటి ముందు నివాసం ఉంటున్న పద్మావతిపై ఇతని కన్నుపడింది. ఆమె బయటకు వచ్చే సమయంలో సెల్వ కుమార్‌ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు సెల్వ తల్లిండ్రులకు తెలిపినా కూడా వారు అతనికే మద్దతు పలికారు.

పద్మావతిని భయపెట్టడానికి ఓ రోజు బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో గర్భిణి అయిన ఆమె తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలైంది. ఈ కేసులో సెల్వకుమార్‌ను పోలీసులు జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చినా కూడా సెల్వకుమార్‌ పద్దతి మార్చుకోలేదు. ఇతడి ఆగడాలను భరించలేని పద్మావతి ఇంటి ముందు సీసీ కెమెరాలు అమర్చుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా సర్దుకుపోండి అని చెప్పడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు