గూగుల్‌ పేతో డబ్బులు కాజేశాడు..

7 Dec, 2019 10:10 IST|Sakshi
వివరాలు తెలుపుతున్న సీఐ వెంకటేశ్వర్‌రావు

నిందితుడిని పట్టుకొని రూ. 2.4 లక్షలు రికవరీ చేసిన పోలీసులు 

కంగ్టి(నారాయణఖేడ్‌): ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు తెలియకుండా గూగుల్‌ పే యాప్‌ ద్వారా డబ్బులు కాజేసిన వ్యక్తిని పోలీసులు చాకచక్యంతో పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 2.4 లక్షలు రికవరీ చేశారు. ఈ సంఘటనలో నిందితుడిని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగుర్‌(కే) గ్రామంలో పోలీసులు  గురువారం అరెస్ట్‌ చేశారు. కంగ్టి సీఐ వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నాగుర్‌(కే) గ్రామానికి చెందిన నడిమిదొడ్డి శాంతమ్మకు కంగ్టిలోని ఏపీజీవీబీలో సేవింగ్‌ ఖాతా ఉంది. తొమ్మిది నెలల క్రితం ఆమె భర్త బాబు మృతి చెందడంతో రైతు బీమా డబ్బులు రూ.5 లక్షలు, కూతురు వివాహం జరగడంతో కల్యాణలక్ష్మి డబ్బులు రూ. 75 వేలు ఖాతాలో జమయ్యాయి. అయితే ఈ ఖాతాల్లో సొమ్ము వచ్చేలా చూడాలని గ్రామంలో పైరవీలు చేసే వాగ్‌మారే తుకారాంకు  బాధిత మహిళ బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లు ఇచ్చింది. ఈ క్రమంలో తుకారాం మహిళను నమ్మించి మాయ మాట లు చెప్పి ఏటీఎం కార్డు సైతం తస్కరించాడు. శాంతమ్మ ఖాతాలో ఉన్న డబ్బులు కాజేయాల ని పథకం వేశాడు.

అంతలోనే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నాడు. అది తుకారాంకు దొరికింది. రాజు తన సిమ్‌ కార్డును రిచార్జీ చేసి దాన్ని వేరే ఫోన్‌లో యాక్టివేట్‌ చేయించుకొన్నాడు. తనకు దొరికిన ఫోన్‌లోని నంబర్‌ను శాంతమ్మ బ్యాంకు ఖాతాకు లింక్‌ చేసుకొనేందుకు మరో మహిళను తీసుకువెళ్లాడు. బ్యాంకులో మరో మహిళ ను పరిచయం చేసి ఆమె శాంతమ్మ అని ఫోన్‌  నంబర్‌ లింక్‌ చేయాలంటూ దరఖాస్తు చేయించాడు. దీంతో తుకారాం మార్గం సుగమం అయింది. తస్కరించిన ఏటీఎం కార్డును ఉపయోగించి తన మొబైల్‌లో గుగూల్‌పే యాప్‌లో డబ్బులను దశల వారీగా డ్రా చేయడం ప్రారంభించాడు. ఇలా రెండు నెలల వ్యవధిలో రూ. 2.5 లక్షలు డ్రా చేశాడు. గత నెల 29వ తేదిన శాంతమ్మ బ్యాంకుకు వెళ్లి ఆరా తీసి రూ. 2.5 లక్షలు డ్రా చేసినట్లు తేలడంతో గగ్గోలు పెట్టింది. ఏడుస్తూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వివరాలు తెలుసుకొన్న పోలీసులు గురువారం నిందితుడిని పట్టుకొని అతని వద్ద నుంచి రూ. 2.4 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. నిందితున్ని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ అబ్దుల్‌ రఫీక్‌ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ నారాయణ, సిబ్బంది ప్రేమ్‌సింగ్, తుకారం ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నువ్‌.. మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్‌కి రా

మహిళ దారుణ హత్య మిస్టరీనే!?

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు మృతి

నృత్యం ఆపిందని ముఖంపై కాల్చాడు..!

ఇండో–టిబెటిన్‌ సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతి

లైంగిక దాడి, హత్య కేసులో జీవిత ఖైదు

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌

తాళ్లతో కట్టేసి..ఊపిరాడకుండా దిండుతో నొక్కి..!

ఆ సమయంలో రెండో ఆప్షన్‌ ఉండదు: సీపీ

9 నెలల చిన్నారిపై మేనమామ అఘాయిత్యం

చట్టం తన పని చేసింది, అంతా 5-10 నిమిషాల్లో

90 శాతం కాలిన గాయాలతో కిలోమీటర్‌ నడిచి..

నలుగురు మృగాళ్ల కథ ముగిసింది..

‘దిశ’ ఇంటి వద్ద భద్రత పెంపు

డ్యాన్స్‌ ఆపివేయడంతో యువతిపై కాల్పులు

సోదరి వరస యువతిపై మృగాడి దాష్టీకం

కీచక గురువు..!

పెళ్లి కుదిర్చినందుకు కమీషన్‌ ఇవ్వలేదని..

నాలుగు మృతదేహాలకు పంచనామా

భూమాయ కేసులో.. కీలక సూత్రధారుల అరెస్టు

ఆ ప్రాణం ఖరీదు రూ.2,500..!

రుణం పేరుతో మోసం.. మహిళ అరెస్ట్‌

పట్టపగలు మహిళపై కాల్పులు

భర్త కిడ్నాప్‌.. భార్య హత్య

ఆ కుటుంబం ఆత్మహత్యకు కారణం అదే..

పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం

టిక్‌టాక్‌లో అసభ్యకర సందేశాలు

‘దిశ’ ఘటన నేపథ్యంలో మళ్లీ తెరపైకి ‘హాజీపూర్‌’

బాలికపై మారు తండ్రి లైంగికదాడి

ట్యూషన్‌లో మృగాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

14 నుంచి క్వీన్‌ పయనం

ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి 

పవన్‌పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

ప్లే బ్యాక్‌ డిఫరెంట్‌గా ఉంటుంది

వినోదం.. వినూత్నం

క్లాస్‌ రాజా