హత్యా.. ఆత్మహత్యా..?

27 Aug, 2018 12:36 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రాజు బంధువులు

అల్గునూర్‌(మానకొండూర్‌): తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీ పంచాయతీ పరిధిలోని చర్లపల్లిలో శనివారం ఓ ఇంటిలో ఉరేసుకుని కనిపించిన యువకుడి మృతదేహాన్ని బంధువులు ఆదివారం గుర్తించారు. రామకృష్ణకాలనీలోని బుడిగె జంగాల కాలనీకి చెందిన కెల్లం రాజుగా నిర్ధారించారు. అది ఆత్మహత్య కాదని అతడి అత్తమామ, బావమరుదులు చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.
 
మృతుడి బంధువుల కథనం ప్రకారం..  
బుడిగె జంగాల కాలనీకి చెందిన కెల్లం రాజు(35)కు స్థానిక యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. భార్య కాపురానికి రాకపోవడంతో కులపెద్దలు బుధవారం పంచాయితీ నిర్వహించారు. తన భార్యను తనతో పంపించాలని, ఇకపై ఎలాంటి పొరపాటు చేయనని రాజు పెద్దల సమక్షంలో ఒప్పుకున్నాడు. అయితే ఈ క్రమంలో కోపోద్రిక్తులైన అత్త, మామ, బావమరుదులు తమ ఆడబిడ్డను మోసం చేశావని, తమకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామనిపెద్దల సమక్షంలోనే హెచ్చరించారు.

మూడు రోజుల తర్వాత శవమై..  
పంచాయితీ జరిగిన రోజు సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన రాజు శనివారం ఉదయం చర్లపల్లిలోని ఓ ఇంటి ఆవరణలో రేకుల షెడ్డుకు ఉరేసుకుని కనిపించాడు. పంచాయితీలో హెచ్చరించినట్లుగానే రాజు బావమరిది రేవెళ్లి శ్రీనివాస్, అత్త, మామ చంపి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారని రాజు బంధువుల ఆరోపిస్తున్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజు బావమరుదులు, మామను అరెస్ట్‌ చేశారు మృతేహాన్ని బంధువులకు అప్పగించారు.  
పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రాజు బంధువులు
 

మరిన్ని వార్తలు