కుటుంబ కలహాలతో వస్త్రవ్యాపారి ఆత్మహత్య 

31 Mar, 2018 11:17 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు

రంగుల్లో కలిపే రసాయనం తాగి అఘాయిత్యం 

సిరిసిల్లటౌన్‌: కుటుంబ కలహాలతో వస్త్రవ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట న సిరిసిల్లలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక సుభాష్‌నగర్‌కు చెందిన మేర్గు సుధాకర్‌(42) సిరిసిల్లలో తయారయ్యే వస్త్రాన్ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాడు.మూడు నెలలుగా ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపంతో ఉంటున్నాడు.  నాలుగురోజుల క్రితం భార్య రమాదేవి సుధాకర్‌తో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. దీంతో శుక్రవారం ఉదయం డైయింగ్‌లో కలిపే రసాయనం(నైట్రాప్‌)తాగి ఇంట్లోనే చనిపోయాడు. మృతుడికి కొడుకు రేవంత్, కూ తురు లహరి ఉన్నారు. అంత్యక్రియల్లో తెలంగాణ రచయితల వేదిక జాతీయ కార్యదర్శి జూకంటి జగన్నాథం, సెస్‌ వైస్‌చైర్మన్‌ లగిశెట్టి శ్రీనివాస్, జిల్లెల్ల పీఏసిఎస్‌ చైర్మన్‌ పబ్బతి విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.     

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు