నా చావుకు ఎమ్మెల్యేనే కారణం

1 Jul, 2020 06:14 IST|Sakshi

గొంతు కోసుకున్న అలంకానిపేట వాసి 

హన్మకొండలోని అమరుల స్తూపం వద్ద ఘటన 

ఎంజీఎంకు తరలించిన పోలీసులు.. పరిస్థితి విషమం 

కాజీపేట అర్బన్‌ /నెక్కొండ: వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణం అంటూ సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లు చిన్న కుమారుడు రామరాజు నర్సంపేటలోని ఓడీసీఎంఎస్‌ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో విధు లు నిర్వర్తిస్తున్నాడు. లాక్‌డౌన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పక్కనబెట్టారు.

ఈ క్రమంలో తన కుమారుడికి తిరిగి ఉద్యోగం ఇప్పించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని నెక్కొండకు వచ్చిన సందర్భంగా వెంకటేశ్వర్లు కోరాడు. మంగళవారం కూడా హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేను కలసి విషయాన్ని వివరించాడు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న వెంకటేశ్వర్లు చాకుతో గొంతు కోసుకున్నాడు. ఈ సందర్భంగా ‘నా చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. కేసీఆర్‌ సార్‌ వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దు’అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టా్ట డు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, వెంకటేశ్వర్లు పరి స్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

విచారణ జరిపిస్తా 
అలంకానిపేట గ్రామ ఆర్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ మాసం వెంకటేశ్వర్లు సూసైడ్‌ నోట్‌లో నా పేరు ప్రస్తావించడంపై విచారణ జరిపిస్తా. గతంలో ఆయన కొడుకు ఉద్యోగం విషయంలో నన్ను కలిశాడు. దీంతో నేను సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చాను. 
-పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే  

మరిన్ని వార్తలు