అత్తారింట్లో అల్లుడి అనుమానాస్పద మృతి 

16 Sep, 2019 11:11 IST|Sakshi

సాక్షి, చెన్నేకొత్తపల్లి(అనంతపురం): అత్తారింట్లో అల్లుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. చెన్నే కొత్తపల్లి మండలం నామాల గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ రమేష్‌ బాబు తెలిపిన వివరాల మేరకు... కూడేరుకు చెందిన వీరాంజనేయులు (32) మూడేళ్ల కిందట నామాల గ్రామానికి చెందిన తులసమ్మను వివాహం చేసుకున్నాడు. ఇటీవల వీరికి కూతురు జన్మించింది. పుట్టింటిలో ఉన్న భార్య, కుమార్తెను చూసేందుకు వీరాంజనేయులు వారం క్రితం నామాలకు వచ్చాడు. ఏమైందో తెలీదు కానీ ఆదివారం తెల్లవారుజామున గదిలో ఉరికి వేలాడుతుండటాన్ని బంధువులు గమనించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్యకు గురయ్యాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు