మూడేళ్ల పాపను 7 అంతస్తుల పైనుంచి విసిరేశాడు

8 Sep, 2019 13:31 IST|Sakshi

ముంబై : నగరంలో దారుణం జరిగింది. మూడేళ్ల పాపను ఏడు అంతస్థుల నుంచి కిందికి విసిరేశాడు ఓ దుర్మార్గుడు. స్నేహితుడి కూతురనే కనికరం లేకుండా ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ముంబైలోని కొలాబాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం రాత్రి 7.30గంటలకు ఈ దారుణ ఘటన జరిగింది. రాత్రి ఏడున్నర గంటలలో అపార్ట్‌మెంట్‌ పెద్ద శబ్దం వచ్చింది. అందరూ వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో చిన్నారి కనిపించింది. అందరూ షాకయ్యారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి... అక్కడికక్కడే చనిపోయింది. ఆ చిట్టితల్లి శరీర భాగాలు ముక్కలైపోయిన దృశ్యం చూసి... అక్కడి వాళ్లంతా తీవ్ర ఆవేదన చెందారు. ఆ చిన్నారిని ఏడో అంతస్థులోని ఓ కిటికిలోంచి పడినట్లు స్థానికులు గుర్తించారు.  

మూడేళ్ల చిన్నారి అంత ఎత్తు కిటికీ ఎక్కలేదని గ్రహించిన వాళ్లు... మొత్తం అపార్ట్‌మెంట్‌ని బ్లాక్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.  చిన్నారి తండ్రి స్నేహితుడు 40 ఏళ్ల అనిల్ చుగానీ అనే వ్యక్తే చిన్నారని తోసేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.  అతనే ఏడో అంతస్థులో ఆడుకుంటున్న పాపను బలవంతంగా ఎత్తుకొని... కిటికీ లోంచీ కిందకు విసిరేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలో ఆ చిన్నారి మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. 

ఏం పాపం చేసిందని ఆ చిట్టితల్లిని అంత క్రూరంగా విసిరేశాడన్నది తెలియలేదు. పోలీసులు అనిల్ చుగానీని అరెస్టు చేశారు. విచారణలో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాగా. రక్తం మడుగులో పడి ఉన్న చిన్నారి చూసి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రోజూ చక్కగా ఆడుకుంటూ తిరిగే పసి పాప... అత్యంత దయనీయ స్థితిలో చనిపోవడం అపార్ట్‌మెంట్‌ వాసుల్ని కలచివేసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చింతమనేని దాడి చేయలేదట!

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

చింతమనేనిపై ఫిర్యాదుల వెల్లువ

రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు.. తెగిపడ్డ వ్యక్తి చేతులు

వార్డర్‌ వేధింపులతో ఖైదీ ఆత్మహత్యాయత్నం?

మహిళా దొంగల హల్‌చల్‌

పాలమూరు జైలుకు నవీన్‌రెడ్డి

వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..

ఆరునెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే..

తక్కువ ధరకే బంగారం అంటూ ఏకంగా..

ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..

నిర్మానుష్య వీధి.. బాబుతో కలిసి మహిళ వెళ్తుండగా..!

కోడలి అక్రమసంబంధం అత్తకు తెలిసి..

మహిళ అనుమానాస్పద మృతి

మత్తులో ఉన్న మహిళలే టార్గెట్‌

ఏటీఎం పగులకొట్టి..

మైకుల వైర్లు కట్‌ చేయించిన ఎస్సై!

కల్యాణలక్ష్మి డబ్బు కావాలని భర్త వేధింపులు

భర్తను చంపినా కసి తీరక...

మృత్యు గెడ్డ

అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడనే..

ఆపరేషన్‌ దొంగనోట్లు

పగలు మెకానిక్‌.. రాత్రి బైక్‌ల చోరీ

కాపురానికి రాలేదని భార్యను..

కన్నకూతురిపైనే అఘాయిత్యం 

లభించని చిన్నారి ఆచూకీ

కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి.. 

వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ దాడి

అవినీతిలో ‘సీనియర్‌’ 

పోలీస్‌ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య

ఆ ఆశ ఉంది కానీ..!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!