సైబర్‌ సైకో అరెస్ట్‌ 

17 Jun, 2018 09:20 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటనర్సయ్య, వెనుకవైపున నిందితుడు 

సత్తుపల్లి : కొద్దిపాటి పరిచయమున్న మహిళను ఫేస్‌బుక్, వాట్సాప్‌లో వేధిస్తున్న వ్యక్తి(సైబర్‌ సైకో)ని సత్తుపల్లి పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి కోర్టుకు అప్పగించారు. విలేకరుల సమావేశంలో సత్తుపల్లి సీఐ ఎం.వెంకటనర్సయ్య తెలిపిన వివరాలు.. సత్తుపల్లి మండలానికి చెందిన ఓ యువతి, అస్ట్రేలియాలో నివసిస్తోంది. ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేటప్పుడు కూకట్‌పల్లి చాంద్రాయనగర్‌కు చెందిన గుడ్డేటి రాఘవేందర్‌తో కొద్దిపాటి పరిచయం మాత్రమే ఉంది.

అతడు కొంతకాలంగా ఆమెకు ఫేస్‌బుక్, వాట్సాప్‌లో అసభ్య పోస్టింగ్‌లు పెడుతున్నాడు. ఫోన్‌ చేసి బెదిరిస్తున్నాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి తెలిపింది. ఆయన ఈ నెల 7న సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న నిందితుడు రాఘవేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, శనివారం కోర్టుకు అప్పగించారు.
 

మరిన్ని వార్తలు