కోరిక తీర్చలేదన్న కోపంతో యువతిని..

2 Sep, 2019 20:01 IST|Sakshi

సాక్షి, చెన్నై : యువతి తనకు లొంగలేదని ఆగ్రహించిన ఓ యువకుడు ఆమెను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విల్లుపురం జిల్లా చిన్న సేలం సమీపంలోని బాక్కంపాడి కాట్టుకొటై ప్రాంతానికి చెందిన చిన్నదురై (32)కి కడలూరు జిల్లా వేప్పూర్‌ సమీపంలోని అగరం గ్రామానికి చెందిన అరుణాదేవి (28)తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నదురై సింగపూరులో పని చేస్తున్నాడు. అరుణాదేవి తన ఇద్దరు కుమారులతో బాక్కంపాడి కాట్టుకొటైలో అత్తతో నివసిస్తోంది. ఏడాది క్రితం అరుణాదేవి పెద్దమ్మ కుమారుడు ప్రశాంత్‌ (29) పొంగల్‌ సారెను తీసుకొచ్చాడు. అతనితో పాటు అతని స్నేహితుడు ఏలుమలై (21) వచ్చాడు. అరుణాదేవిని చూడగానే ఏలుమలైకు ఆమెపై వాంఛ కలిగింది. ఆమె ఫోన్‌ నంబర్‌ తెలుసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఏలుమలై బాక్కంపాడి కాట్టుకొటై వచ్చాడు.

ఇంటిలో అరుణాదేవి ఒంటరిగా ఉండడంతో తన వాంఛ తీర్చాలని ఒత్తిడి తెచ్చాడు. దీన్ని ఊహించని అరుణాదేవి దిగ్భ్రాంతి చెంది వెంటనే  అతన్ని అక్కడ నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరించింది. అయినప్పటికీ ఏలుమలై ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో క్యాన్‌లో ఉన్న కిరసిన్‌ను అరుణాదేవి ఒంటిపై పోసి నిప్పు పెట్టాడు. అరుణాదేవి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని అంబులెన్స్‌లో ఆమెను సేలం జిల్లా ఆత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు శనివారం రాత్రి ఆస్పత్రికి వచ్చి అరుణాదేవి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఏలుమలైపై హత్యయత్నం కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షమీపై అరెస్ట్‌ వారెంట్‌

పోలీసుల అదుపులో హేమంత్

దారుణం : 90 ఏళ్ల వృద్ధుడిని ఫ్రిజ్‌లో కుక్కి..

విషాదం: ఆడుకుంటూ చెరువులో పడి..

చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం

మోడల్‌కు అసభ్యకర సందేశాలు పంపుతూ..

సతీష్‌ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు

వివాహేతర సంబంధం పర్యవసానం.. హత్య

డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో దారుణం..!

14 ఏళ్ల బాలికను అతికిరాతకంగా..

భార్యను కాపురానికి పంపలేదని..

అల్లుడి చేతిలో అత్త దారుణహత్య..!

పగ పెంచుకొని.. కత్తితో దాడి 

పండగ వేళ విషాదం

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

వృద్ధురాలి హత్య..!

‘కస్టమర్‌ కేర్‌’ టోకరా!

పైశాచికమా.. ప్రమాదమా?

ఒక ఆటో..70 సీసీ కెమెరాలు

పరీక్ష రాస్తూ యువకుడి మృతి

అయ్యో.. పాపం!

ఆశలు చిదిమేసిన లారీ

అమెరికాలో మళ్లీ కాల్పులు

ప్రియురాలు మోసం చేసిందని..

బాయ్ ఫ్రెండ్‌తో వీడియో కాల్‌ మాట్లాడుతూ..

అమ్మాయిలను ఆకర్షించేందుకు..

దారుణం: ఐసీయూలో ఉన్న మహిళా రోగిపై..

దారుణం : ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

వృద్ధురాళ్లే టార్గెట్‌.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

ముద్దంటే ఇబ్బందే!

రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

నటుడిని చితక్కొట్టిన యువకుడు