మంద్‌సౌర్‌ కేసు: దిగ్భ్రాంతికర అంశాలు

3 Jul, 2018 09:37 IST|Sakshi
మంద్‌సౌర్‌లో దారుణానికి వ్యతిరేకంగా మహిళల ఆందోళన

భోపాల్‌ : సంచలనం సృష్టించిన మంద్‌సౌర్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో పోలీసులు దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడించారు. ఈ దారుణం ముందుగానే అనుకుని.. ప్లాన్‌ ప్రకారం జరగలేదని, అప్పటికప్పుడు దుష్టుల బుర్రలో పుట్టిన ఆలోచన అని పోలీసులు అధికారులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఆసిఫ్‌(24), ఇర్ఫాన్‌(20) పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.

జరిగిన దారుణం గురించి ఇచ్చిన నిందితుడు ఇర్ఫాన్‌ నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. ‘ఈ సంఘటన జరిగిన రోజున బాలిక పాఠశాల ఆవరణలో ఒంటరిగా నిల్చుని ఉంది. ఆ సమయంలో ఇర్ఫాన్‌ అక్కడి నుంచే వెళ్లాడు. అక్కడ ఒంటరిగా ఉన్న బాలికను చూశాడు. మరో పది నిమిషాల తర్వాత ఇర్ఫాన్‌ అక్కడికి వచ్చేటప్పటికి కూడా ఆ బాలిక ఇంకా అక్కడే ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. దాంతో ఇర్ఫాన్‌ ఆ బాలిక దగ్గరకు వెళ్లి మిఠాయిలు కొనిపిస్తానని నమ్మబలికి చిన్నారిని తనతో తీసుకెళ్లాడు. బాలికను తీసుకెళ్తున్న సమయంలో ఎవరైనా ఈ విషయం గురించి అడిగితే స్కూల్‌ అయిపోయినా బాలికను తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదని.. అందుకే తాను బాలికను ఇంటికి తీసుకెళ్తున్నాను చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం బాలికను పాఠశాల వెనక ఉన్న పాడుబడిన లక్ష్మీదర్వాజ అనే బిల్డింగ్‌కు తీసుకెళ్లాడు. తర్వాత తన స్నేహితుడు ఆసిఫ్‌కు ఫోన్‌ చేశాడు. అనంతరం వారు దారుణంగా ఆ చిన్నారిని అత్యాచారం చేసి గొంతు కోశార’ని పోలీసులు తెలిపారు.

అయితే ఆ బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తెలపగా, నిందితులు మాత్రం తాము ఇద్దరమే అని చెప్పారు.

మరిన్ని వార్తలు