ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్‌ లభ్యం

26 Jan, 2020 09:04 IST|Sakshi

సాక్షి బెంగళూరు: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టిన ఆదిత్యరావుకు సంబంధించి పోలీసులు తనిఖీ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్‌ లభ్యం కావడం, అంతేకాకుండా కర్ణాటక బ్యాంకులో ఓ లాకర్‌ బాంబు తయారీ వస్తువులన్నీ భద్రపరిచినట్లు తెలిపాడు. ఈక్రమంలో ఉడుపిలోని కర్ణాటక బ్యాంకుకు తీసుకెళ్లారు. తనిఖీ చేయగా బ్యాగులో తెల్లటి రంగులో ఉన్న పొడిని సెనైడ్‌గా పోలీసులు భావించారు. (అందుకే ఎయిర్పోర్టులో బాంబు పెట్టాను)


మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టే సమయంలో ఎవరైనా అడ్డు వస్తే సెనైడ్‌ టచ్‌ చేసి వెళ్లేందుకు సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా సెనైడ్‌ను బ్యాంకు లాకర్‌లో ఉంచినట్లు ఆదిత్యరావు తెలిపాడు. అదేవిధంగా మంగళూరులో బాంబు పెట్టిన రోజున అతడు ఉడుపిలోని వడాభండేశ్వర ఆలయానికి  వెళ్లాడు. ఈక్రమంలో తనిఖీల్లో భాగంగా నిన్న ఆదిత్యరావును ఉడుపి తీసుకెళ్లారు. ఆలయం నుంచి జిమ్‌ మాస్టర్‌కు తన సిమ్‌ నుంచి కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా నిందితుడు ఉపయోగించిన సిమ్‌ లభ్యం కాలేదు. (మంగళూరు ఎయిర్పోర్టులో బాంబు)

మరిన్ని వార్తలు