అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

4 Apr, 2018 11:55 IST|Sakshi
సునీత మృతదేహం

చివ్వెంల(సూర్యాపేట) : అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని జి.తిర్మలగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆత్మకూర్‌(ఎస్‌) మండల పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన ఉప్పుల బుచ్చిమల్లు కుమార్తె కొమ్ము సునీత(28)కు  చివ్వెంల మండల పరిధి జి.తిర్మలగిరి గ్రామానికి చెందిన కొమ్ము వెంకన్నతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కాగా మంగళవారం ఉదయం సునీత తీవ్ర అస్వస్థతకు గురకావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.   మృతురాలి తండ్రి బుచ్చిమల్లు ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
సూర్యాపేట క్రైం : వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సునీత మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గాయపడిన సునీతను ఆస్పత్రిలో చేర్పిం చగా  వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్స అందించకపోవడంతోనే మృతిచెందిందని ఆరోపించారు. మరో ఆస్పత్రికి వెళ్తామని చెప్పినా తామే వైద్యం చేస్తామని నిర్లక్ష్యం చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  విషయం తెలుసుకున్న పోలీ సులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు