వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

10 Dec, 2018 13:16 IST|Sakshi
మృతి చెందిన వెంకటేశ్వరమ్మ

అత్తింటి వారే చంపేశారని బంధువుల ఆరోపణ

అనుమానం పెనుభూతంగా మారడంతో ఘటన

కృష్ణాజిల్లా, ముసునూరు (నూజివీడు) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్త మామలు, తోటి కోడలు, బావగార్లు మూకుమ్మడిగా పెడుతున్న వేధింపులకు తాళలేక ఓ మహిళ పురుగు మందు తాగి తనువు చాలించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కేవీజీవీ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చింతలవల్లి శివారు గోగులంపాడుకు చెందిన ఎలికే అనిల్‌ భార్య వెంకటేశ్వరమ్మ (25) భార్యా భర్తలు. వీరు 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరమ్మ ఆదివారం ఉదయం పురుగు మందు తాగింది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో ప్రథమ చికిత్స అందించి, అనంతరం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందింది.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తుండగా, అల్లుడు, అత్తింటివారే తమ బిడ్డను అంతమొందించినట్లుగా మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గోగులంపాడులోని ఇంటివద్ద అత్త, స్థానికులను ఎస్‌ఐ విచారించి ఆధారాలు సేకరిస్తున్నారు. నూజివీడు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. మృతురాలి తల్లిదండ్రులు కొండలరావు, రంగారావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!