వివాహిత ఆత్మహత్య

1 Sep, 2018 13:09 IST|Sakshi
సురేఖ మృతదేహం

గూడూరు రూరల్‌: గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో నివాసం ఉంటున్న అల్లూరు సురేఖ(32) అనే వివాహిత గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు శుక్రవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఏరియా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు మనుబోలు మండలం చెర్లోపల్లికి చెందిన అల్లూరు సుబ్బయ్య, సురేఖలకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది.

వీరికి స్వరూప, వినయ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం గత ఐదేళ్లుగా చెన్నూరులో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మనుబోలు పోలీస్‌స్టేషన్‌లో కూడా భర్తపై సురేఖ ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు సర్దిచెప్పి పంపారు. మద్యానికి బానిసైన సుబ్బయ్య తమ కుమార్తెను తరచూ వేధిస్తుండేవాడని తల్లి సుశీలమ్మ కన్నీటిపర్యంతమైంది. భర్తే చంపి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ ఎం.బాబి తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈవ్‌టీ(నే)జర్స్‌!

కలవరపెట్టిన చిన్నారుల అదృశ్యం

లక్కీడ్రా అంటూ ఫ్లిప్‌కార్ట్‌ పేరుతో టోకరా..

అడ్డొస్తున్నాడని అంతమొందించింది

కారే చితిగా మారిందా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిన్న వయసులోనే దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు

హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!