జనగామలో వివాహిత ఆత్మహత్య

28 Sep, 2018 17:05 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించిన మృతురాలి బంధువులు, భర్త,పిల్లలతో కలిసి ఉన్న సుధారాణి (ఫైల్‌) 

అత్తామామ, భర్త వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ

జనగామ అర్బన్‌: జిల్లా కేంద్రానికి చెందిన ఓ వివాహిత బుధవారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, మృతురాలి బాబాయి కొత్తకొండ భాస్కర్, మేనమామ శ్రీనివాస్, బంధువుల కథనం ప్రకారం... జనగామకు చెందిన తాళ్ల భానుచందర్‌కు హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన సుధారాణి(33)తో 2009 సంవత్సరంలో వివాహమైంది. జనగామ గుండ్లగడ్డ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఆరు నెలలుగా అత్తామామ, భర్త వేధింపులు పెరి గాయి. దీంతో భరించలేక సుధారాణి ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో పెద్ద మనుషులు సర్టి చెప్పి ఆమెను పంపగా తీసుకువచ్చా డు. అయినా వారిలో మార్పు లేకపోయింది. దీంతో సుధారాణి మనస్తాపం చెంది బుధవారం రాత్రి పురుగులమందు తాగింది. దీంతో స్థానిక జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.

జనగామ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత
సుధారాణి మృతదేహం ఉన్న అంబులెన్స్‌తో బంధువులు జనగామ పోలీస్‌స్టేషన్‌ వద్ద గురువారం రాత్రి ధర్నా చేపట్టారు. ఆమె మృతికి భర్త, అత్త, మామ వేధింపులే కారణమంటూ, ఈ విషయమై పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులకు, మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పట్టణ సీఐ శ్రీనివాస్‌ బాధితులకు న్యాయం చేస్తానని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. జనగామ ఎస్సై మహ్మద్‌ హమీద్‌ కేసును దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.


 

మరిన్ని వార్తలు