చెరువులో పడి వివాహిత మృతి

14 Nov, 2018 07:14 IST|Sakshi
మృతి చెందిన శాంతమ్మ

దుస్తులు ఉతుకుతుండగా ఫిట్స్‌ రావడం వల్లే...!

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కృష్ణదాస్‌

శ్రీకాకుళం, నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న జలగల చెరువులో పడి కోవెల వీధికి చెందిన పెదిలాపు శాం తమ్మ (52) మృతి చెందింది. మంగళవారం ఉద యం ఈ ఘటన చోటుచేసుకుంది. రజక వృత్తి చేసుకునే శాంతమ్మ కొంతకాలంగా ఫిట్స్‌ వ్యాదితో బాధపడుతోంది. మంగళవారం దుస్తులను చెరువులో ఉతుకుతుండగా ఫిట్స్‌ వ్యాధి రావడం, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో మునిగి పోయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

ఉదయం పది గంటల సమయంలో మిగి లిన రజకులు దుస్తులు ఉతుకుతుండగా శాంత మ్మ మృతదేహం కాలికి తగిలింది. వెంటనే ఆమె మృతదేహాన్ని బయటకుతీసి భర్త మల్లేసుకు సమాచారం అందించారు. శాంతమ్మ ఉదయం నుంచీ కనిపించకపోవడంతో పట్టణంలోకి వెళ్లిం దని భావించామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ మెకు ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ వివా హాలు అయ్యా యి. శాంతమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణదాస్‌ పరామర్శ..
శాంతమ్మ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ పరామర్శించారు. సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులతో చర్చించారు. ఈయన వెంట పార్టీ నాయకులు చింతు రామారావు, కోటిపల్లి శ్రీను తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు