శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మహిళ అదృశ్యం

22 Oct, 2019 10:59 IST|Sakshi
లక్ష్మీభవాని

శంషాబాద్‌: మస్కట్‌ నుంచి వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా పెరవాలి మండలం కాపవరం గ్రామానికి చెందిన లక్ష్మీభవాని (23) ఉపాధి కోసం మస్కట్‌ వెళ్లింది. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఈ నెల 10న అర్ధరాత్రి మస్కట్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి ఇంటికి చేరుకోలేదు. ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ ఉండటంతోపాటు బంధువుల ఇంటి వద్ద కూడా లేకపోవడంతో ఆమె సోదరుడు సతీశ్‌ సోమవారం ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు