దైవసన్నిధిలో వివాహిత ఆత్మహత్య

21 Oct, 2017 13:45 IST|Sakshi
తల్లి మృతదేహం వద్ద దీనంగా చిన్నారులు

నర్రవాడ(దుత్తలూరు): దైవసన్నిధిలో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న  ఘటన శుక్రవారం నర్రవాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..కలిగిరి మండలం నాగసముద్రం బీసీ కాలనీకి చెందిన ఇర్ల రాజేశ్వరి(30), వెంకటేశ్వర్లు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో పనిచేస్తూ దసరాకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం పనికి వెళ్దామని భార్యను కోరగా, తనకు ఆరోగ్యం సరిగాలేదని తెలిపింది. భర్త పనికి వెళ్లిన తరువాత కుమార్తె, కుమారుడ్ని తీసుకుని వింజమూరు బయల్దేరింది. వింజమూరులో పిల్లలకు టిఫిన్‌ పెట్టించి పురుగుల మందు కొనుగోలు చేసింది. అక్కడ్నుంచి వెంగమాంబ దర్శనం చేసుకుందామని నర్రవాడకు తీసుకొచ్చింది. వెంగమాంబ దర్శనం అనంతరం క్యూలైన్ల సమీపంలోని మెట్ల వద్ద పిల్లలతో కూర్చుంది.

పిల్లలు ఆకలేస్తుందమ్మా ఇంటికి వెళ్దామనగా, కాలకృత్యాలు తీర్చుకురండి వెళ్దామని చెప్పింది. పిల్లలు పక్కనే ఉన్న చెట్ల చాటుకు కాలకృత్యాలకు వెళ్లగా రాజేశ్వరి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించింది. తిరిగి వచ్చిన పిల్లలు తల్లి నోరు, ముక్కు వెంట నురుగు రావడం చూసి భయంతో చుట్టుపక్కల వారిని కేకలు వేశారు. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై ఎం వెంకటరాజేష్‌  ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. తల్లి మృతదేహంవద్ద పిల్లలు కన్నీరుమున్నీరు కావడం పలువురిని కంట తడిపెట్టించింది. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌