వివాహిత అనుమానాస్పద మృతి

7 Sep, 2018 13:41 IST|Sakshi
శ్రీలక్ష్మి మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ

ప్రకాశం, మార్కాపురం: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని తోటవారి వీధిలో జరిగింది. స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో టెక్నికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఉప్పలపాటి పుల్లయ్య భార్య శ్రీలక్ష్మి తన ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయి ఉండటాన్ని గురువారం సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కోటయ్య కథనం ప్రకారం.. పుల్లయ్యకు 23 ఏళ్ల క్రితం కందుకూరుకు చెందిన శ్రీలక్ష్మితో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక తమ కుమార్తె ఉరేసుకుని చనిపోయినట్లు మృతురాలి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు ఇచ్చాడని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించారు.

మరో మహిళ కూడా..
ఉల్లగల్లు (తాళ్లూరు): ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామానికి చెందిన ఇందూరి అంకమ్మ (26) గురువారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాపయ్యతో అంకమ్మకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. గత రాత్రి భార్య, భర్తల మధ్య స్పల్ప వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో నివాసం ముందు ఉన్న ఊయలకు అంకమ్మ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త గమనించే సమయానికే ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంది. సమాచారం ఎస్‌ఐ శివనాంచాయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐటీ ఉద్యోగినిపై అత్యాచార యత్నం

బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్తూ..

ప్రాణం తీసిన ఫైనాన్స్‌

నేరాల అడ్డా..చీమకుర్తి గడ్డ!

రైలు కింద పడి వివాహిత ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అందుకే పారితోషికాల్లో వ్యత్యాసం’

రానా చేతుల మీదుగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్‌

ప్రతినాయక పాత్రలకు సిద్ధం : బాలకృష్ణ

అక్టోబ‌ర్ 5న ‘ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌’

రాజమౌళి మల్టీస్టారర్‌పై మరో అప్‌డేట్‌

2.ఓ టీంకు డెడ్‌లైన్‌..!