భార్యను హత్య చేసి.. ఇంటికి తాళం వేసి..

4 Aug, 2019 11:14 IST|Sakshi
భర్త చేతిలో హత్యకు గురైన చాందిని, ఇన్‌సెట్‌లో భర్త, బిడ్డతో చాందిని (ఫైల్‌) 

అత్తింటి వారి చేతిలో వివాహిత దారుణ హత్య

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు

మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

సాక్షి, కడప : భార్యకు తోడు నీడగా ఉండాల్సిన భర్త ఆ బాధ్యతను విస్మరించాడు. కోడలిని కూతురిలా చూసుకోవాల్సిన అత్తింటివారు కర్కశంగా ప్రవర్తించారు. చివరకు భర్తతో పాటు అత్తమామలు కలిసి ఆమెను ఇంట్లోనే హత్య చేసి ఆపై ఇంటికి తాళం వేసి పరారయ్యారు. కడప నగరం అల్లూరి సీతారామరాజు నగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు నగర్‌లో నివాసముంటున్న చాందిని(22)కి మారుతి అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కొద్దికాలం పాటు వీరి సంసారం సాఫీగా సాగింది. ఆ తర్వాత డబ్బుల కోసం చాందినీకి వేధింపులు మొదలయ్యాయి.

అలాగే ఇటీవల తనకు టచ్‌ ఫోన్‌ కొనివ్వాలని చాందిని తల్లిని అల్లుడు మారుతి అడిగాడు. ఫోన్‌ కొనివ్వలేదనే కోపంతో పాటు, ఇంకా డబ్బులు ఇవ్వలేదనే కక్ష పెంచుకున్న భర్త, అత్తింటివారు శుక్రవారం అర్థరాత్రి సమయంలో వారు నివాసముంటున్న ఇంటిలోనే చాందిని తల పగులగొట్టి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యారు. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా చాందిని హత్యకు గురై ఉంది. మృతురాలి తల్లి ఖాసీంబీ ఫిర్యాదు మేరకు భర్త మారుతి, అత్తమామలు, ఆడబిడ్డ, మరిదిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణ హత్య: సీరియల్‌ సన్నివేశాలే స్ఫూర్తి

కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

మద్యం దొరక్కపోవడంతో వ్యక్తి ఆత్మహత్య!

కరోనా పాజిటివ్‌: ఆ జర్నలిస్టుపై ఎఫ్‌ఐఆర్‌

ఆత్మహత్య: ఏం కష్టం వచ్చిందో..? 

సినిమా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు