కళాశాలలో విషాద‘గీతిక’

14 Aug, 2018 13:08 IST|Sakshi
కంటతడి పెడుతున్న గీతిక తల్లి

రుయాలో సంతాపసభ

గీతిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

స్వస్థలం కడప తరలింపు

తిరుపతి అర్బన్‌: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మెడికోలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సంచలనం సృష్టించాయి. తక్కువ కాల వ్యవధిలో ఇద్దరు తనువు చాలించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. వరుస సంఘటనలు జరగడంతో కళాశాలలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. సహచరులు సోమవారం ఆందోళన చెందా రు. విషాద వాతావరణం అలముకుంది.  ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఆది వారం ఆత్మహత్య చేసుకున్న  ఎంబీబీ ఎస్‌ విద్యార్థిని పి.గీతిక మృతదేహాన్ని సోమవారం ఆయన రుయా మార్చురీలో పరిశీలించారు. ఆమె కుటుంబ స భ్యులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.  రుయా ప్రభుత్వ వైద్యులు, జూడాల సంఘం నాయకులు సోమవారం మెడికల్‌ కాలేజీ ఆడిటోరియంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్, ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్‌ శ్రీనివాసరావు, జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరమణ, సభ్యురాలు లావణ్య తదితరులు హాజరై ఇద్దరు వైద్య విద్యార్థుల చిత్ర పటాలకు పుష్పాంజలితో నివాళులర్పించారు. వారిద్దరి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ
గీతిక మృతదేహానికి రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిద్ధానాయక్‌ ఆధ్వర్యంలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. తిరుపతి ఈస్ట్‌ డీఎస్పీ మునిరామ య్య మీడియాతో మాట్లాడుతూ గీతిక మృతి పూర్తిగా వ్యక్తిగతమని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ డివిజన్‌ మే జిస్ట్రేట్‌ (ఆర్‌డీఓ), తహసీల్దార్‌ల పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తి చేసినట్లు వెల్లడిం చారు.  కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. గీతిక మృతికి  మెడికల్‌ కాలేజీలో వేధింపులు, ఇతర సమస్యలు కారణం కాదని, చదు వులో వెనుకబాటుతనం మాత్రమే ఉందని ఆమె తల్లి చెప్పినట్లు  స్పష్ట్టం చేశారు.   గీతిక సూసైడ్‌ నోట్‌లో కూడా ఎవరి పేర్లు లేవని, ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని డీఎస్పీ పేర్కొన్నారు.  గీతిక మృతదేహానికి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పోస్టుమార్టం పూర్తిచేసి స్వస్థలం కడప నగరానికి తరలించారు.

మరిన్ని వార్తలు