అయిదు రోజులైనా లభించని బీటెక్‌ విద్యార్థి ఆచూకీ

15 Feb, 2020 11:25 IST|Sakshi
బీటెక్‌ విద్యార్థి జీవన్‌రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, మేడ్చల్‌ : బీటెక్‌ విద్యార్థి జీవన్‌రెడ్డి ఆచూకీ ఇంకా లంభించలేదు. యువకుడు కనిపించకుండా పోయి అయిదు రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ మాత్రం తెలియడం లేదు. మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న జీవన్‌ రెడ్డి.. సమీపంలోని హరిహర హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జీవన్‌ అయిదు రోజుల నుంచి కనిపించడం లేదని హాస్టల్‌ సిబ్బంది తల్లిదండ్రలకు సమాచారం అందిచారు. కాగా హాస్టల్‌ రూమ్‌ బాత్‌రూంలో రక్తపు మరకలు కనపడటంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై బహీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిని పోలీసులు ప్రాథమిక విచారణలో జీవన్‌ తోటి విద్యార్థులతో కలిసి బయట లోన్‌ తీసుకున్నట్లు గుర్తించారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించలేక బయపడి హాస్టల్‌ నుంచి యువకుడు పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జీవన్‌ సెల్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా అతన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా