నకిలీ నంబర్‌ ప్లేట్‌తో కారులో చక్కర్లు!

9 May, 2020 08:01 IST|Sakshi

ఇద్దరి అరెస్టు...కారు సీజ్‌

మేడ్చల్‌: కారుకు నకిలీ నంబర్‌ ప్లేట్, నకిలీ ఆర్‌సీ సృష్టించడంతో పాటు దానికి పోలీస్‌ స్టిక్కర్‌ అతికించి లాక్‌డౌన్‌ సమయంలో యథేచ్ఛగా తిరుగుతున్న ఇద్దరిని కీసర పోలీసులు అరెస్టు చేశారు.  పోలీసుల కథనం ప్రకారం... విశాఖపట్నానికి చెందిన బాలాజీ టాటా సఫారీ వాహనాన్ని అతడి మిత్రులు నాగారానికి చెందిన భరత్‌గౌడ్‌ (32), కుషాయిగూడకు చెందిన వెంకటేశ్వర్‌రావు (31) నాలుగు నెల క్రితం నగరానికి తెచ్చారు.  దానికి 07 బీఎం 5555 అనే నకిలీ నంబర్‌ ప్లేటు ఏర్పాటు చేసిన వీరు పోలీసులమని చెప్పి టోల్‌ ప్లాజాల్లో టోల్‌ చెల్లించకుండా తిరుగుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా.. అందులో 2 మద్యం బాటిళ్లు, రూ14 వేల నగదు లభించింది. భరత్‌గౌడ్, వెంకటేశ్వర్లను విచారించగా.. కారు నంబర్‌ ప్లేటు, ఆర్‌సీ కూడా నకిలీదేనని తేలింది.  దీంతో వారిని అరెస్టు చేసి కారును సీజ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు